Madanapalle: ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి పాల్పడిన ముగ్గురిపై తాలూకా పోలీసులు 420 చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

0
90

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి పాల్పడిన ముగ్గురిపై తాలూకా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని తాలూకా సీఐ కళా వెంకటరమణ సోమవారం మీడియాకు వెల్లడించారు.

 

సీఐ తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని పొన్నేటిపాలెం పంచాయతీ రామిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన తరిగొండ శ్రీనివాసులురెడ్డి, నారాయణరెడ్డి, ఎం. సుధాకర్‌లు పొన్నేటిపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని రామిరెడ్డిగారిపల్లె శివారులో సర్వే నంబర్ 360లో ఉన్న 3,300 చదరపు అడుగుల (55×60) ఇంటి స్థలాన్ని 2023లో స్థానిక నక్కలదిన్నెకు చెందిన ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ దేవేంద్రకు రూ.11.15 లక్షలకు విక్రయించారు.

 

అయితే అదే స్థలాన్ని ఇప్పటికే 2014, 2020 సంవత్సరాల్లో ఇతరులకు విక్రయించి వారి నుంచి కూడా నగదు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో బాధితుడు దేవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)కు అనుగుణంగా మోసానికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్న సినిమాల విజయం చిత్ర సీమకు శుభ పరిణామం ఎంపీ కేశినేని శివనాథ్
*ప్రచుర‌ణార్థం* *15-01-2026*     *చిన్న సినిమాల విజయం చిత్రసీమకు...
By Rajini Kumari 2026-01-16 12:49:07 0 212
Uttar Pradesh
UP Schools Nominated for World’s Best School Prizes
In a moment of immense pride for Uttar Pradesh, two prominent institutions—the "Healthy...
By Lokeshwari Panthadi 2026-06-30 07:12:50 0 82
Andhra Pradesh
సినీ నటుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బెజవాడ బార్ అసోసియేషన్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సినీ నటుడు రాజ్ కమార్ ఆధ్వర్యంలో బెజవాడ బార్ అసోసియేషన్ లో ఘనంగా జరిగిన క్రిస్టమస్ వేడుకలు....
By Rajini Kumari 2025-12-25 11:00:42 0 283
SURAKSHA
Bhorkhade Hemant IAS: Championing Good Governance
A Dynamic Telangana IAS Officer Driving Inclusive Development, Efficient Governance, and...
By Lokeshwari Panthadi 2026-07-15 13:15:24 0 146
Andhra Pradesh
సిటిఎం చెరువు గట్టున మృత శిశువు కలకలం.
మదనపల్లె మండలం సీటీఎం చెరువు గట్టు వద్ద బుధవారం ఒక బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర కలకలం...
By Pagadala Venkateswar 2026-05-14 05:54:28 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com