చిన్న ముక్క పల్లెలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పరిశీలించిన టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్

0
246

 

 

 

*గడువు జూలై 24 వరకు పొడిగింపు.. అర్హులంతా ఎస్‌ఆర్‌ఎఫ్ ఫారాలు తప్పనిసరిగా సమర్పించాలని పిలుపు*

 

 

రాయచోటి రూరల్ పరిధిలోని చెన్నముక్కపల్లె గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను టీడీపీ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణ, ఫారాల పరిశీలన తదితర అంశాలను ఆయన పరిశీలించి సంబంధిత సిబ్బందితో మాట్లాడారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎస్‌ఐఆర్ ప్రక్రియకు తొలుత ఈ నెల 14వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండగా, ప్రజలకు మరింత అవకాశం కల్పించేందుకు భారత ఎన్నికల సంఘం మరో 10 రోజుల పాటు గడువును పొడిగించిందని తెలిపారు. దీంతో ఈ నెల 24వ తేదీ వరకు ఎస్‌ఆర్‌ఎఫ్ ఫారాలను సమర్పించే అవకాశం ఉందన్నారు.ఇంకా ఎస్‌ఆర్‌ఎఫ్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా జూలై 24లోపు తమ ఫారాలను సమర్పించాలని గండికోట సుధాకర్ విజ్ఞప్తి చేశారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన పత్రాలతో దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
Uniformed Intimidation: Police Weaponize Defamation
A disturbing 2026 trend shows individual police officers filing massive personal defamation and...
By JoinBMA 2026-08-21 08:27:25 0 86
Andhra Pradesh
మదనపల్లె: రూ. 21 కోట్లతో తాగునీటి పనులు.. MLA, జేసీ భూమి పూజ.
మంగళవారం, ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లె ప్రజల తాగునీటి దాహాన్ని...
By Pagadala Venkateswar 2026-05-27 06:10:37 0 116
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం ఎన్నిక
అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ప్రకటించిన పసుపులేటి హరిప్రసాద్...
By Benguluri Madhubabu 2026-02-12 04:32:50 0 326
Telangana
దంతేపల్లి గ్రామంలో సిసి రోడ్ పనులు ప్రారంభం...
రామయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో బుధవారం రోడ్డు పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి...
By Katiyala JeevanRaj 2026-04-08 10:36:07 0 444
Andhra Pradesh
Chandrababu Naidu: టీడీపీ వర్క్‌షాప్‌... కార్యకర్తల మధ్యలో కూర్చున్న చంద్రబాబు.
టీడీపీ పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయకులతో కలిసి...
By Pagadala Venkateswar 2026-01-28 07:56:19 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com