రుషికొండ భవనాలపై కీలక ప్రకటన.. వినియోగంపై ప్రతిపాదనలకు ఆహ్వానం.

0
106

రుషికొండ భవనాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదన్న ప్రభుత్వం

పర్యాటక వినియోగంపై ప్రతిపాదనలు కోరిన ఏపీటీడీసీ

ఈ అంశంపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ

లీజు వ్యవహారంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వెల్లడి

విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన వివాదాస్పద భవనాలను ఇప్పటివరకూ ఎవరికీ కేటాయించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ భవనాలను పర్యాటక సంబంధిత కార్యకలాపాలకు ఏ విధంగా వినియోగించాలనే అంశంపై ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) వెల్లడించింది.

 

ఈ భవనాలను మరియు అక్కడ ఉన్న ఖాళీ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా మూడో పక్షానికి లీజుకు ఇవ్వకుండా చూడాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ పీవీఎన్ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

Search
Categories
Read More
BMA
Compound Trauma: Fact-Checkers Reliving Endless Crises
The relentless news cycle has created a perfect storm for newsroom burnout. Indian fact-checkers...
By JoinBMA 2026-08-21 11:35:29 0 384
SURAKSHA
Rajeev Krishna, IPS: Leading UP Police with Vision
A distinguished 1991-batch IPS officer of the Uttar Pradesh Cadre, Shri Rajeev Krishna serves as...
By Lokeshwari Panthadi 2026-07-17 13:17:43 0 203
SURAKSHA
Shri Nikhil U. Dessai: Transforming Governance Through Vision
A dedicated civil servant whose experience, integrity, and administrative leadership continue to...
By Kalaga Sailaja 2026-07-27 14:00:51 0 111
Andhra Pradesh
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండగ 2.0 కు శ్రీకారం
*పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండుగ-2.0కు శ్రీకారం*   *గ్రామ సీమల అభ్యున్నతికి పవన్ కళ్యాణ్...
By Rajini Kumari 2026-01-02 12:31:21 0 266
Andhra Pradesh
దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం.
దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం.. ఈరోజు మార్కాపురం మండల...
By Chennaiah Kati 2026-06-28 13:15:21 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com