పోలీసులకు ఆరోగ్య పరీక్షలు.|

0
147

"గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా హెల్త్ చెక్-అప్ క్యాంప్.. 127 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు"

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 8: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ బుధవారం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. 

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ జోన్-1 డీసీపీ కనకాల రాహుల్ రెడ్డి, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, మల్కాజిగిరి ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ పి. సుబ్బయ్య పర్యవేక్షణలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ శిబిరం నిర్వహించారు.

ఈ ఆరోగ్య శిబిరంలో మొత్తం 127 మంది పోలీసు సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నేత్ర పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిల పరీక్షలు, ఈసీజీ, ఆర్థోపెడిక్ పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించి వైద్య నిపుణులు అవసరమైన సూచనలు అందించారు.

శిబిరం నిర్వహణలో రెటినోవా ఫౌండేషన్ నేత్ర వైద్య సేవలు, శ్రీకర ఆసుపత్రి సాధారణ ఆరోగ్య పరీక్షలు, స్కై ఫిట్ ఫిజియోథెరపీ ఆర్థోపెడిక్ సేవలు, పద్మ సాయి డెంటల్ దంత వైద్య సేవలు అందించి సహకరించాయి.

గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎం. రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమానికి కమిషనరేట్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు తెలిపారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Goa
Goa Healthcare Initiatives 2026: Strengthening Care
Goa's healthcare initiatives in 2026 focus on improving access to quality medical services and...
By Fathima Safa 2026-06-16 07:06:17 0 163
Andhra Pradesh
జనసేన నాయకుల మనవతా జనసేన నాయకుల మానవతా దృక్పథం
జనసేన నాయకుల మానవతా    ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు కుటుంబానికి శ్రీ పంచకర్ల...
By Chennaiah Kati 2026-01-27 16:05:16 0 227
Andhra Pradesh
పుంగనూరు: గ్రానైట్ లారీలకు రూ 1. 82 లక్షల ఫైన్
చిత్తూరు జిల్లా, రొంపిచర్ల క్రాస్ వద్ద శనివారం అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న రెండు లారీలను ఎస్సై...
By Kothuru Murali 2026-04-19 11:13:39 0 122
Telangana
అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కాంగ్రేస్ కార్యకర్తకి స్థానిక ఎమ్మెల్యే పరామర్శించారు కసిరెడ్డి నారాయణరెడ్డి
ఈరోజు రంగా రెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామ వాస్తవ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ...
By MERIGE MALLESH 2026-04-01 12:55:48 0 1K
Telangana
నూతన రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్‌ వెంకటాపురం డివిజన్‌లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ...
By Sidhu Maroju 2025-11-28 05:22:34 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com