నా బంగారు పొలం నాకు ఇవ్వాలని ఫిర్యాదు

0
151

వరంగల్ /చెన్నారావుపేట::::: చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరెకరాల భూమి.. తమకు కౌలుకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలంటూ యజమానిని పలువురు సంప్రదిస్తున్నారు. ఇంత డిమాండ్ ఎందుకు? ఆ భూమిలో బంగారం ఏమైనా పండుతుందా అంటే అవుననే అంటున్నారు గ్రామస్థులు. ఈ భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేశారు. ఈర్యతండాకు చెందిన రైతు దీన్ని కౌలుకు తీసుకొని ఏడాది పత్తి సాగు చేస్తున్నారు. ఈ నెల 24న కలుపు తీయిస్తుండగా మహిళా కూలీలకు కౌలుకు తీసుకొని ఏడాది పత్తి సాగు చేస్తున్నారు. ఈ నెల 24న కలుపు తీయిస్తుండగా మహిళా కూలీలకు బంగారు ఆభరణాలు దొరికినట్లు ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న యజమాని కూలీలను పిలిచి విచారించగా దొరికిన బంగారు వస్తువులను చూపించారు. దీనిపై యజమాని ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఈ ప్రాంతంలో పూర్వం ఆలయాలున్నాయని.. 1991లో అప్పటి భూ యజమానికి కూడా కొంత బంగారం దొరికిందని, తర్వాత కొన్నేళ్లకు పొలంలో జీతం ఉన్న వ్యక్తికి కూడా దొరికిందని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో దేవతామూర్తుల విగ్రహాలు లభించాయన్నారు. దొరికిన బంగారాన్ని పంచుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకొని దాన్ని తమకు అందించి న్యాయం చేయాలని తొలుత భూమి విక్రయించిన వ్యక్తి కుమారుడు సోమవారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. మరోవైపు కనకం దొరికినట్లు జరుగుతున్న ప్రచారంతో రాత్రి సమయంలో భూమిలో చుట్టు పక్కల గ్రామాల వారు సంచరిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురం: SBI బ్యాంక్ వారి ప్రాపర్టీ ఎక్స్‌పో 2026 ఈ 13,14 తేదీలు మాత్రమే రుణాల ఆఫర్
అనంత: SBI వారి గృహ రుణాలు 13,14 తేదీలలో సంక్రాంతి ఆఫర్లు ఇస్తుంది  వివిధ రియల్ ఎస్టేట్...
By Eslavath RameshNaik 2026-01-14 07:13:08 0 295
Telangana
మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.   మల్కాజ్ గిరి కార్పొరేటర్...
By Sidhu Maroju 2025-07-23 16:39:39 0 1K
Andhra Pradesh
2025లో ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందా? పెరిగిందా? వివరాలు డీజీపీ మాటల్లో..
2025 సంవత్సరానికి వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విడుదల చేశారు. గత...
By John Baji 2025-12-29 12:51:04 0 229
Andhra Pradesh
అన్యాకంతమైన భూములను పరిరక్షించాలి: ఎమ్మెల్యే బేబినాయన
వేణుగోపాల స్వామి భూములు అన్యా కంతమాయ్యాయని, వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-02-27 11:05:22 0 238
SURAKSHA
The Sentinel of Sri Sathya Sai: The Unyielding Integrity of S. Sathish Kumar
A Guardian of the People: Redefining Community Policing in Andhra Pradesh In the modern era of...
By Kalaga Sailaja 2026-07-13 13:55:26 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com