హైటెక్ సిటీలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.|

0
126

"శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం."

హైదరాబాద్ : హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో నేడు సాయంత్రం జరిగే 'రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం' నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి, ఐకియా జంక్షన్, ట్రైడెంట్ హోటల్, శిల్పకళా వేదిక, శిల్పారామం, మెటల్ చార్మినార్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 

ఈ కార్యక్రమానికి సుమారు 5,000 మంది రైతులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని, తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

అయితే, ఉద్యోగాలు ముగిసే రద్దీ సమయంలోనే కార్యక్రమం నిర్వహించడంతో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో పనిచేసే పలువురు ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
SURAKSHA
S. Davidson Devasirvatham: An Inspiring IPS Journey
A distinguished 1995-batch Tamil Nadu cadre IPS officer whose three decades of exemplary...
By Lokeshwari Panthadi 2026-07-20 09:48:40 0 230
Andhra Pradesh
పుంగనూరు: ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ లో బక్రీద్ పండుగ సందర్భంగా ఆదివారం శాంతి కమిటీ సమావేశం...
By Kothuru Murali 2026-05-24 17:33:19 0 122
Kerala
Kerala Faces Heavy Rains; Red Alert in Several Northern Districts
The India Meteorological Department has issued red alerts for northern Kerala districts,...
By Bharat Aawaz 2025-07-17 06:52:58 0 2K
Andhra Pradesh
అంబేద్కర్ జయంతి సందర్భంగా చీరాల మ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
టిటిడి కళ్యాణ మండపం నుండి ర్యాలీ గా వెళ్లి ముక్కోనపు పార్కు, పేరాల ఈపురుపాలెం తోటవారిపాలెం...
By Vadlamudi NagaVenkat 2026-04-14 11:55:24 0 241
Andhra Pradesh
పుంగనూరు: బలమైన నాయకులను జైల్లో పెడుతున్నారు: ఎంపీ
తెలుగుదేశం పార్టీ తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టి ఆనందం పొందుతోందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి...
By Kothuru Murali 2026-03-17 07:03:36 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com