రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా దోర్నాల మండలానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ గార్లు

1
107

రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా దోర్నాల మండలానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు

ఈ నెల 27వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో గంటావానిపల్లిలో చేపట్టిన ఏర్పాట్లు మరియు భద్రతా చర్యలను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత, ఐఏఎస్., జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గార్లు పరిశీలించి, సభా ప్రాంగణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

హెలిప్యాడ్ ప్రాంతం, వీఐపీల వాహనాల రాకపోకలు, పార్కింగ్ ప్రాంతం మరియు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ ఏర్పాట్లను సమీక్షించారు. ఇంకా చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన చర్యలను చేపట్టాలని జిల్లా ఎస్పీ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో భాగంగా మొత్తం 400 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, రెవెన్యూ అధికారులు, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీనివాసరావు, వై.పాలెం ఇన్‌స్పెక్టర్ కె. అజయ్ కుమార్, త్రిపురాంతకం సీఐ అసన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ముంబై ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిశ్చార్జ్.
  ముంబై ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిశ్చార్జ్ 15-07-2026 Wed  Andhra...
By Pagadala Venkateswar 2026-07-15 05:35:32 0 102
SURAKSHA
Sudhansh Pant: Steering Rajasthan with Vision and Integrity
Introduction (The Hook) "Good governance is measured not by policies on paper, but by the...
By Fathima Safa 2026-07-21 05:57:58 0 108
Andhra Pradesh
పొదిలి పట్టణంలో సర్ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించిన
l జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు గారు,ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి,ఇతర అధికారులు.ఈ...
By Chennaiah Kati 2026-07-07 06:23:43 0 126
Andhra Pradesh
పైలట్ కావాలనుకునే వారికి శుభవార్త.. ఇక ఏపీలోనే శిక్షణ!
  పైలట్ కావాలనుకునే వారికి శుభవార్త.. ఇక ఏపీలోనే శిక్షణ! 13-08-2026 Thu 10:08 Andhra...
By Pagadala Venkateswar 2026-08-13 05:39:58 0 90
Andhra Pradesh
మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి అధికారుల బాధ్యతే: ఎమ్మెల్యే.
మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఆయా శాఖల అధికారుల బాధ్యతేనని ఎమ్మెల్యే షాజహాన్ బాష అన్నారు. సోమవారం...
By Pagadala Venkateswar 2026-01-20 06:31:10 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com