గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!.

0
106

 

గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!

Andhra

Somu Veerraju commends Deputy CM Pawan Kalyan for Godavari pollution control

గోదావరి ప్రక్షాళనకు కేంద్రం ఏడాదికి రూ. 400 కోట్లు కేటాయించిందన్న వీర్రాజు

పుష్కరాల నేపథ్యంలో 290 గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉందని వ్యాఖ్య

ఆంధ్ర పేపర్ మిల్లుకి నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించడంపై హర్ష్యం

గోదావరి నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. నది ప్రక్షాళన కోసం కేంద్రం ఏడాదికి రూ.400 కోట్ల చొప్పున నిధులు ప్రకటించిందని, అందులో ఇప్పటికే రూ.100 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోని 290 గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉందన్న ఆయన.. మునికూడలిలో ఘాట్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోందని తెలిపారు.

 

 

ఇదే సమయంలో, గోదావరి నది కాలుష్యంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన తీరును సోము వీర్రాజు అభినందించారు. నదిని కాలుష్య కోరల నుంచి కాపాడేందుకు ఆంధ్ర పేపర్ మిల్లుతో పాటు రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పవన్ ఆదేశించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతంలో పేపర్ మిల్లు కాలుష్యంపై ఎవరు మాట్లాడినా బ్లాక్‌మెయిల్ చేస్తారనే వాదన ఉండేదని, కానీ ఒక డైనమిక్ లీడర్‌గా పవన్ కల్యాణ్ ఆ అడ్డంకులను అధిగమించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.

 

 

దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందిస్తున్న నరేంద్ర మోదీ పాలన స్ఫూర్తితోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రధాని మోదీ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తాడిపత్రిలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ – ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై భారం
తాడిపత్రిలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ – ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై భారం  న్యాయజ్యోతి :...
By Chennaiah Kati 2026-06-17 17:39:08 0 121
BMA
Defending Independent Journalism Against Fake News
While combating misinformation is crucial, the Indian press is fiercely protecting its power...
By JoinBMA 2026-08-20 05:53:21 0 164
Andhra Pradesh
ఏం జరుగుతోంది యూపీలో సిగ్గు,సిగ్గు,సిగ్గు
ఏం జరుగుతోంది యూపీలో సిగ్గు,సిగ్గు,సిగ్గు ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన ఈ సంఘటన...
By Chennaiah Kati 2026-07-14 03:51:12 1 106
SURAKSHA
Women Safety: Nirbhaya Teams Active Patrol
Goa Police Nirbhaya Teams patrol buses, colleges, markets and beaches for women safety. Female...
By Kalaga Sailaja 2026-07-03 07:46:44 0 123
Andhra Pradesh
కార్యకుల సమ్మెతో పోర్టులో నిలిచిపోయిన కార్యకలాపాలు – చట్టాల మార్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన
కాకినాడ: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేంద్ర కార్మిక సంఘాలు...
By Ratna Sekhar 2026-02-12 09:19:58 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com