ఏడు కాలనీల సీవరేజ్ సమస్యల పరిష్కారానికి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎంను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి".|

0
232

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (HMWSSB) జనరల్ మేనేజర్‌ను కలిసి ముత్యంరెడ్డి నగర్, నాగిరెడ్డి కాలనీ, ఎగ్జిక్యూటివ్ కాలనీ, దినకర్ నగర్, మాధవి నగర్, అయ్యర్ బస్తీ మరియు రాజీవ్ వీకర్ సెక్షన్ ప్రాంతాల్లో కొత్త మురుగునీటి కాలువల (సీవరేజ్ లైన్లు) మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయా కాలనీల ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సీవరేజ్ సమస్యలను జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లిన శాంతి శ్రీనివాస్ రెడ్డి, కొత్త సీవరేజ్ లైన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి పనులను తక్షణమే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 

అలాగే ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న పలు తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల సంబంధిత అభివృద్ధి పనులపై కూడా అధికారులతో విస్తృతంగా చర్చించి వాటి అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్న శాంతి శ్రీనివాస్ రెడ్డి, కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జనరల్ మేనేజర్ సమర్పించిన వినతిపత్రాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
St.ann's కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తున్న JNTUK కాకినాడ ఇంటర్ కాలేజీ గేట్ క్రికెట్ (Men) టోర్నమెంట్ సెలక్షన్ ట్రైల్స్ 2025-2026 టోర్నమెంట్ ప్రారంభోత్సవం
చీరాల: St.ann's కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తున్న JNTUK కాకినాడ ఇంటర్...
By Gadiyapudi Narendra 2026-01-19 14:35:50 0 501
BMA
Immersive Reporting: Slow Journalism in Rural India
Mainstream breaking news rarely spends more than a few hours covering rural issues before moving...
By JoinBMA 2026-08-24 06:07:02 0 131
Telangana
"అల్వాల్‌లో అంబేద్కర్‌కు ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ గౌరవ నివాళి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓల్డ్...
By Sidhu Maroju 2026-04-14 08:51:06 0 393
Telangana
అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డులలో తడిసిపోయిన ధాన్యం, రైతన్నలకు తీవ్ర నష్టం
అకాల వర్షాల (Unseasonal Rains) కారణంగా తెలంగాణ రాష్ట్రంల్లోని రైతన్నలకు తీవ్ర నష్టం...
By Ponnala Srinivasrao 2026-05-27 04:15:49 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com