"మీ బండి కూడా ఉందా..? 446 వాహనాల జాబితా విడుదల చేసిన పోలీసులు”|

0
174

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీధుల్లో వదిలివేయబడిన వాహనాలపై పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు.

మొత్తం 446 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని త్వరలో వేలం వేయనున్నట్లు వెల్లడించారు. వీటిలో ఫోర్ వీలర్లు, త్రీ వీలర్లు, టూ వీలర్లు ఉన్నాయి.

స్వాధీనం చేసుకున్న వాహనాలను సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్, అంబర్‌పేట్‌లో భద్రపరిచారు. అలాగే ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ఫోర్ వీలర్, త్రీ వీలర్ వాహనాలను ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పూలింగ్ పాయింట్‌లో ఉంచారు.

సంబంధిత చట్టాల ప్రకారం ఈ వాహనాలను వేలం వేయాలని మల్కాజిగిరి పోలీసులు నిర్ణయించారు.

వాహనాల పూర్తి వివరాలను మల్కాజిగిరి పోలీస్ అధికారిక వెబ్‌సైట్ లో “Citizen Services – Abandoned Vehicles – 2026” విభాగంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తమ వాహనం అందులో ఉందేమో యజమానులు పరిశీలించుకోవాలని సూచించారు.

వాహనాలకు సంబంధించిన యజమానులు లేదా హైపోతెకేషన్ వ్యక్తులు తగిన పత్రాలతో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి ఆరు నెలల లోపు DCP CAR Headquarters, మల్కాజిగిరి, అంబర్‌పేట్ కార్యాలయాన్ని సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

 ఆధారాలు పరిశీలించిన అనంతరం వాహనాలను యజమానులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం 8008338535, 8712662661 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష... లక్షల కుటుంబాలకు వరాలు!.
  రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష...  Chandrababu Naidu Reviews Revenue...
By Pagadala Venkateswar 2026-04-09 04:57:01 0 189
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అన్నమయ్య జిల్లాలో మార్చి 1 నుండి 8 వరకు 'మహిళా సాధికారత...
By Pagadala Venkateswar 2026-03-02 03:13:43 0 218
Andhra Pradesh
మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరల పెరుగుదల.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె టమాటా మార్కెట్‌లో టమాటా ధరలు గణనీయంగా పెరిగాయి. శుక్రవారం...
By Pagadala Venkateswar 2026-04-10 06:29:52 0 148
Delhi - NCR
Delhi-NCR Intensifies Air Quality Control Measures
Delhi-NCR continues to strengthen its air quality management strategy through coordinated efforts...
By Fathima Safa 2026-06-25 11:42:15 0 85
Telangana
జర్నలిస్ట్ సాంబా పై అక్రమ కేసులు ఎత్తివేయాలి : డీజీపీని కలిసిన టియుడబ్ల్యూజే నేతలు
 హైదరాబాద్:    ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను...
By Sidhu Maroju 2025-09-15 16:45:16 0 518
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com