భూమి రికార్డుల తారుమారు కలెక్టర్‌కు బాధితుడి మొర

0
316

బాపట్ల, 

సొంత భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో జరిగిన అవకతవకలపై బాపట్ల జిల్లా కలెక్టర్‌కు ఓ రైతు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాల్లో సక్రమంగా ఉన్న భూమి, ఆన్‌లైన్ రికార్డులకు వచ్చేసరికి గందరగోళంగా మారిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా అన్నం బోట్లవారి పాలెం గ్రామానికి చెందిన రైతు తూబాటి శివకోటేశ్వరరావుకు గ్రామంలోని సర్వే నంబర్ 213 సి లో 1 ఎకరం 39 సెంట్ల మెట్ట భూమి ఉంది. రిజిస్టర్ రికార్డుల ప్రకారం ఈ భూమి ఆయన పేరు మీదే ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ (వెబ్ ల్యాండ్ ) రికార్డుల్లో మాత్రం తప్పుగా నమోదైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సర్వే నంబర్ 213 ఎ లో 0.39 సెంట్లు మీద, 213 బి లో 0.39 సెంట్లు మీద ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నాయని, అయితే తన రికార్డుల్లో ఉండాల్సిన 1.39 ఎకరాలకు గాను కేవలం 0.68 సెంట్లు మాత్రమే చూపిస్తోందని బాధితుడు వివరించారు.

రికార్డుల తారుమారుని సాకుగా చూపి, కొంతమంది వ్యక్తులు తన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని శివకోటేశ్వరరావు ఆరోపించారు. తన పొలానికి పక్కనే ఉన్న చెన్నపాటి కోట సుబ్బారావు, చెన్నపాటి అంకమ్మ, చెన్నపాటి ధర్మ, ముక్కా శ్రీను తదితరులు గట్టు పంచాయితీలు సృష్టించి, మట్టి తోలుతూ తన భూమిని ఆక్రమించేందుకు అడ్డుపడుతున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

తక్షణమే స్పందించి తన భూమి రికార్డులను సరిచేసి, ఆక్రమణదారుల నుండి తనకు, తన భూమికి రక్షణ కల్పించాలని ఆయన జిల్లా అధికారులను కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో ప్రత్యేక పూజలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు ఆలయాలలో గురువారం తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని విశేష...
By Kothuru Murali 2026-03-20 06:13:05 0 195
SURAKSHA
Karnataka Police Today: Service Beyond Uniform Duty
he perception of policing in Karnataka is undergoing a significant transformation. Moving away...
By Kalaga Sailaja 2026-07-04 06:21:27 0 150
Andhra Pradesh
చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు..
  చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో! 20-06-2026 Sat 16:49...
By Pagadala Venkateswar 2026-06-20 13:35:28 0 107
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ అవగాహన సదస్సులో పాల్గొన్నా. మాసాపేట శివ
     ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న "SIR" (Special Intensive Revision)...
By Benguluri Madhubabu 2026-07-04 10:04:00 0 171
Telangana
కౌకుంట్ల మండలం లో పలు గ్రామాలకు నీళ్ళు బంద్
కౌకుంట్ల మండలంలో  ఉన్నటువంటి ముచ్చింతల, అప్పంపల్లి, దాసరపల్లి, తిరుమలాపూర్ గ్రామాలకు మిషన్...
By Dodla Nagaraju 2026-04-23 03:29:52 0 378
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com