చీరాల ఎగ్జిబిషన్‌లో ధరల 'దోపిడీ'.. కలుషిత ఆహారంతో ప్రజల ఆరోగ్యం విలవిల!

0
354

చీరాల

పాత పట్టణంలోని పాత భవాని థియేటర్ ఆవరణలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న 'అనిత ట్రేడ్ ఫెర్ రోబోటిక్ ఫిష్ టన్నల్' ఎగ్జిబిషన్ సందర్శకుల పాలిట శాపంగా మారింది. వినోదం పేరుతో యాజమాన్యం సామాన్య ప్రజల జేబులకు చిల్లు పెడుతూ,మరోపక్క నాణ్యత లేని ఆహారంతో ప్రాణాలతో చెలగాటమాడుతోందని సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ నుంచి ఆటల వరకు అంతా వసూళ్లే

ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ టికెట్, పార్కింగ్ ధరల దగ్గరి నుంచే వసూళ్లు మొదలవుతున్నాయి. లోపల ఏర్పాటు చేసిన ఫ్యాన్సీ స్టాళ్లలో నాణ్యత లేని వస్తువులను సైతం 'ఫిక్స్‌డ్ రేట్' పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక వినోదం కోసం ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్ వంటి వాటి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కో రైడ్‌కు భారీగా వసూలు చేస్తున్న యాజమాన్యం, కనీసం పది నిమిషాలు కూడా తిప్పకుండా కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే ముగించేస్తూ పిల్లలను, పెద్దలను దించేస్తున్నారు.

రంగులమయమైన 'కలుషిత' ఆహారం

ఎగ్జిబిషన్‌లోని ఫుడ్ కోర్టుల పరిస్థితి చూస్తే ప్రజలు హడలిపోతున్నారు. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా వంటి పదార్థాలలో విపరీతమైన రంగులు కలుపుతూ ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. వంట చేసే ప్రదేశంలో కనీస శుభ్రత లేకపోవడమే కాకుండా, ఈగలు ముసురుతున్న వాతావరణంలోనే వంటలు సాగుతున్నాయి. అధిక ధరలు పెట్టి కొన్నా కూడా కనీస నాణ్యత లేకపోవడంతో ప్రజలు వేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణ నడిబొడ్డున ఇంత దారుణంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నా, అనుమతులిచ్చిన అధికారులు పర్యవేక్షించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

 ధరల నియంత్రణ ఏది

   అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, ఎగ్జిబిషన్ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలని, అధిక వసూళ్లకు పాల్పడుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని చీరాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
Rangareddy
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ కాలనీలో అక్రమ నిర్మాణాల జోరు? 150 గజాల స్థలాల్లో G+4 నిర్మాణాలు... పట్టించుకోని అధికారులు?
మల్లంపేట: ‎మల్లంపేటలోని డ్రీమ్ వ్యాలీ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే...
By Ponnala Srinivasrao 2026-09-01 04:55:15 0 158
SURAKSHA
M. A. Saleem, IPS: Leading Karnataka Police with Vision
A distinguished 1993-batch Karnataka cadre IPS officer whose commitment to professional policing,...
By Lokeshwari Panthadi 2026-07-18 11:16:49 0 106
Sikkim
Sikkim Leads India’s Organic Farming Growth and Innovation
Sikkim continues to strengthen its reputation as India’s first fully organic state, setting...
By Fathima Safa 2026-06-25 08:59:17 0 94
SURAKSHA
Bridging Potential: The Inspiring Journey of Amrita Singh, IAS
A Visionary Administrator Empowering the Future of Haryana In the quiet corridors of governance...
By Kalaga Sailaja 2026-07-17 08:33:55 0 119
Andhra Pradesh
జులై 29న గురు పౌర్ణమి వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు!
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం గుడిశవారిపల్లి సాయిబాబా ఆలయంలో జులై 29న గురు పౌర్ణమి వేడుకలను...
By Pagadala Venkateswar 2026-07-24 05:14:24 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com