హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి

0
178

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి చెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‎ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

‎సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ గారి సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు.

‎బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన కేటీఆర్, వారికి ధైర్యం చెబుతూ తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

‎ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే కేటీఆర్ తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని తన పీఏ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.

‎అలాగే శంషాబాద్ ఏసీపీ నాగభూషణం గారితో స్వయంగా మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. 

‎బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

‎మృతుల దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించే ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని తన బృందాన్ని కేటీఆర్ ఆదేశించారు.

‎తమ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ఇలా రోడ్డు ప్రమాదాల్లో పోవడం తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొంటూ.. మృతుల కుటుంబాలకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో తోడుంటామని కేటీఆర్ గారు భరోసా కల్పించారు.

Search
Categories
Read More
Telangana
మేడ్చల్ జిల్లాలో అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి.
మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ...
By Thalakayala Nagashiva 2026-04-15 05:11:17 0 353
SURAKSHA
Odisha Cyber Police Warn Against Online Fraud
: To protect citizens from digital scams, Odisha Police cyber cell held an awareness session for...
By Kalaga Sailaja 2026-07-06 10:58:14 0 391
Entertainment
Singer Asha bhosle expired
ప్రముఖ నేపథ్య గాయని, జాతీయ అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ శ్రీమతి ఆశా భోంస్లే గారి మరణం పట్ల...
By G k Nookala 2026-04-12 13:34:37 0 186
Andhra Pradesh
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ప్రతి...
By Benguluri Madhubabu 2026-02-17 05:44:28 0 311
Andhra Pradesh
మదనపల్లె: 'మా బిడ్డలాగే వాడినీ వెంటనే చంపాలి'.
మదనపల్లెలో తమ బిడ్డను అతను ఎంత దారుణంగా చంపాడో, అంతే దారుణంగా వెంటనే అతడిని కూడా చంపాలని బాలిక...
By Pagadala Venkateswar 2026-02-17 11:41:09 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com