పెట్రోల్, డిజీల్ కొరతపై చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... ఏపీలో మెరుగుపడుతున్న పరిస్థితులు.

0
158

ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అధికారుల వరుస సమావేశాలు

క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సీఎంకు నివేదించిన అధికారులు

11,909 కిలోలీటర్ల పెట్రోల్, 19,707 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేసిన ఆయిల్ కంపెనీలు

ఆదివారం నాటికంటే మెరుగైన సరఫరా

రాత్రిళ్లు కూడా లోడ్ డిస్పాచ్ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశం

సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశం

రాష్ట్రంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ కొరతపై నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి, విశాఖకు బయలుదేరే ముందు మరోసారి పరిస్థితిపై సమీక్షించారు.

 

అలాగే విశాఖ నుంచి మరోసారి టెలి కాన్ఫరెన్స్ చేపట్టారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్య సాధారణస్థితికి చేరుకునేంత వరకు ఎవ్వరూ విశ్రమించవద్దని, ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతూ, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు.

 

సోమవారం మొత్తంగా 2,679 లోడ్లను రాష్ట్రంలోని వివిధ పెట్రోల్ బంకులకు పంపాలని ప్రణాళికలు సిద్దం చేస్తే వాటిల్లో 2,079 లోడ్లు ఇప్పటికే బయలుదేరాయని, వీటిల్లో కొన్ని గమ్యస్థానాలకు చేరుకున్నట్టు అధికారులు వివరించారు. ఇక మిగిలిన మరో 600 లోడ్లను డిస్పాచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ 2,079 లోడ్లల్లో 11,909 కిలోలీటర్ల పెట్రోల్, 19,707 కిలోలీటర్ల డీజిల్ వివిధ బంకులకు వెళ్లాయని అన్నారు.

 

రాష్ట్రంలోని మూడు ఆయిల్ సరఫరా కంపెనీలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ సంస్థల ద్వారా ఈ మొత్తం లోడ్ డిస్పాచ్ అయిందని, ప్రతి లోడ్‌కు రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని అటాచ్ చేసి పంపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. డిస్పాచ్ అయ్యే ప్రాంతం నుంచి దూరంగా ఉండే ప్రాంతాలకు లోడ్‌లు చేరడం కొంచెం ఆలస్యమవుతోందని అధికారులు వెల్లడించారు.

 

రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ లోడ్ డిస్పాచ్ రాత్రిపూట కూడా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదివారం నాటితో పోల్చుకుంటే సోమవారం ఆయిల్ సరఫరా మెరుగైంది. ఇక సోమవారం ఉదయంతో పోల్చుకుంటే, సాయంత్రానికి అనకాపల్లి, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం, మార్కాపురం వంటి జిల్లాల్లో బంకుల్లో పెట్రోల్, డీజిల్ లభ్యత మెరుగైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రాత్రి ఏడు గంటల సమయానికి 6,511 కిలోలీటర్ల పెట్రోల్, 9,046 కిలోలీటర్ల మేర అమ్మకాలు జరిగాయి.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
Somu Veerraju: శాసనమండలిలో సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు... సభ రేపటికి వాయిదా.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం చర్చ అనంతరం మరో ప్రశ్నపై మాట్లాడేందుకు...
By Pagadala Venkateswar 2026-02-26 11:32:32 0 180
Bharat Aawaz
Why Bharat Aawaz Is Not Just a Media Channel, But a Mission!
🛕 From Reporting to Nation Building – Together, We Rise Bharat Aawaz is not just...
By BMA ADMIN 2025-06-28 09:14:03 0 3K
Andhra Pradesh
మదనపల్లి: నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోండి.. పద్మనాభరెడ్డి.
అన్నమయ్య జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, నార్లు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతు...
By Pagadala Venkateswar 2026-05-04 05:50:16 0 120
Himachal Pradesh
Himachal Pradesh Boosts Infrastructure and Connectivity
Himachal Pradesh is witnessing major progress in infrastructure and connectivity projects aimed...
By Fathima Safa 2026-06-29 12:26:48 0 143
Telangana
సామాన్య ప్రజలకు హక్కులు అందించిన మన రాజ్యాంగం- ప్రొఫెసర్ కోదండరాం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశ సామాన్య ప్రజలకు హక్కులు అందించినది మన రాజ్యాంగమని మాజీ శాసన...
By Sidhu Maroju 2025-11-26 15:38:01 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com