చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు.

0
139

 

చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు

20-04-2026 Mon 08:59 | Andhra

Chandrababu Naidu 76th Birthday Free Meals at Anna Canteens

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం

 సీఎం పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం

 విరాళాన్ని అందించిన సీఎం సతీమణి నారా భువనేశ్వరి

 రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచిత భోజన సేవలు

 సీఎంకు వెల్లువెత్తిన రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తన 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన రూ.76 లక్షల విరాళాన్ని సీఎం సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగతంగా అందించిన సంగతి తెలిసిందే. ఈ రోజు సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్‌లో అల్పాహారం చేయనున్నారు.

 

సీఎం జన్మదినం సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ రంగాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంత్రులు, పలు పార్టీల నాయకులు, టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ తెలిపారు. ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని పలువురు ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏఐటీయూ 18వ మహాసభలు
*ఎమ్మిగనూరు నియోజకవర్గం AITUC 18, వ మహాసభలు పాత మున్సిపల్ ఓపెన్ థియేటర్ లో నిర్వహించడం జరిగింది.*...
By Boya Dasthagiri 2026-03-23 12:22:02 0 339
SURAKSHA
Rajesh Rajora IAS: Architect of Madhya Pradesh’s Growth
A seasoned administrator leading transformative development through strategic governance and...
By Lokeshwari Panthadi 2026-08-01 09:35:01 0 112
Andhra Pradesh
కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి.
వైఎస్సార్ కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్కల గుంపు దాడిలో ఓ చిరుత పులి కూన మృతి...
By Pagadala Venkateswar 2026-04-08 06:00:46 0 186
Andhra Pradesh
మదనపల్లి లో పడిపోయిన టమాట ధరలు
మదనపల్లె టమాటా మార్కెట్లో 10 కిలోల బాక్స్ రూ.220కి పడిపోయింది. మార్కెట్‌కు మంగళవారం...
By Pagadala Venkateswar 2026-01-20 11:00:35 0 212
SURAKSHA
Sharad Satya Chauhan IPS: Driving Punjab Police Growth
Sharad Satya Chauhan, IPS – A Visionary Leader Strengthening Punjab Police Infrastructure...
By Lokeshwari Panthadi 2026-07-25 11:25:31 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com