తపాలా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పథకం కింద నగదు ప్రోత్సాహం

0
392

నందిగామ ఎన్టీఆర్ జిల్లా

2025 సంవత్సరమునకు గాను తపాలా శాఖ వారు నిర్వహించినటువంటి దీన్ దయాల్ స్పర్శ యోజన స్కాలర్షిప్ పరీక్షలో నందిగామ కాకతీయ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని అందులో భాగంగా విజేతలైన విద్యార్థులకు 6000 క్యాష్ ప్రైస్ మరియు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని, ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ విజయవాడ డివిజన్ విజయవాడ శ్రీ ఎం నరసింహస్వామి తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించినటువంటి తపాలా స్కాలర్షిప్ పరీక్షలో 40 విజేతలకు గాను 6 గురు కాకతీయ స్కూల్ నుండి ప్రాతినిధ్యం వహించడం అభినందనీయమని విద్యార్థులకు మరియు కాకతీయ స్కూల్ యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ విధముగా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి తపాలా శాఖ స్కాలర్షిప్ పరీక్షల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగా విద్యార్థులు ఎక్కువ మొత్తంలో పాల్గొనాలని నరసింహ స్వామి పిలుపునిచ్చారు. మరియు జాతీయస్థాయిలో జరిగేటువంటి ఫిలాటిలిక్ ఎగ్జిబిషన్ లో భాగంగా పేరున్న ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు వారి యొక్క జాతీయ స్థాయి గుర్తింపు నిమిత్తం కార్పొరేట్ మరియు కామెమోరాటివ్ స్టాంప్స్ రిలీజ్ కు ముందుకు రావలసిందిగా  ఎం. నరసింహస్వామి  అభ్యర్థించారు. ఈ కార్యక్రమమునకు నందిగామ పోస్టల్ ఇన్స్పెక్టర్ లాహోరి విష్ణు, కాకతీయ స్కూల్ డైరెక్టర్ కార్తికేయ స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ సిబ్బంది మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
1వ వార్డు సమస్యపై కౌన్సిలర్ వినోద్ కుమార్ విజ్ఞప్తి. వెంటనే స్పందించిన అధికారులు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు జనకాపూర్, పోచమ్మ కాలనీలలో వర్షపు...
By Chunarkar Jagadeesh 2026-07-04 09:01:19 0 273
Andhra Pradesh
జిల్లాలో విస్తారంగా ఖనిజ సంపద ఉంది: మంత్రి కొల్లు రవీంద్ర.
అన్నమయ్య జిల్లాలో బైరటీస్‌తో పాటు పలు విలువైన ఖనిజాలు విస్తారంగా ఉన్నాయని రాష్ట్ర గనులు,...
By Pagadala Venkateswar 2026-06-12 04:31:13 0 106
Andhra Pradesh
చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజ దర్బార్ నిర్వహించిన కలెక్టర్ గారు
ఈరోజు చిత్తూరు కలెక్టర్  ఆఫీసులో కలెక్టర్ గారు ప్రజాదర్బార్ నిర్వహించారు ఇందులో ప్రజలు ...
By Kothuru Murali 2025-12-29 14:22:43 0 212
Andhra Pradesh
యాక్సిడెంట్.. ఆర్మీ మాజీ ఉద్యోగి మృతి
విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. గజపతినగరం మండలం బంగారమ్మపేట...
By Boiena Rajesh 2026-02-28 14:17:55 0 219
BMA
Bharat Media Association
The Bharat Media Association isn't just an organization; it's the collective heartbeat of India's...
By Bharat Aawaz 2025-06-06 07:01:18 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com