అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

0
418

 

-- 861 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం

-- రూ. 15 వేల కోట్ల‌కు పైగా విలువైన భూమిని కాపాడిన ప్ర‌భుత్వం

న‌గ‌ర చ‌రిత్ర‌లో నిలిచిపోయే భారీ ఆప‌రేష‌న్‌ను ప్ర‌భుత్వ‌ యంత్రాంగం శ‌నివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిర్వ‌హించింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విదంగా 861ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని రెవెన్యూ, మున్సిప‌ల్, పోలీసు అధికారుల‌తో క‌లిసి హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ‌ మార్క‌ట్లో రూ. 15 వేల కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. భారీ పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిప‌ల్ శాఖ‌ల‌తో పాటు ఇత‌ర విభాగాలు ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించాయి. ఇప్ప‌టికే ఇల్లు క‌ట్టుకుని ఉన్న వారిని మిన‌హాయించి ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇల్లు క‌ట్టుకున్నపేదలు, సామాన్యులు ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు మైకులో అధికారులు మైకు ద్వారా ప్ర‌క‌టించాయి. దీంతో పేద‌లంతా ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రా ఫెన్సింగ్ కార్య‌క్ర‌మానికి స‌హ‌క‌రించారు. ఇదే స‌మంలో అక్క‌డ పాత లే ఔట్ల‌లోని ప్లాట్ల య‌జ‌మానులు సంబ‌రాలు చేసుకున్నారు. ట‌పాసులు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. మా లే ఔట్ల‌ను కాపాడుకోడానికి మేమంతా కోర్టుకు వెళ్లి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. ప్ర‌భుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు.. కాదు లే ఔట్లు వేశాం ఆ భూమి మాది అని అక్క‌డి ప్లాట్ల య‌జ‌మానులు కోర్టులో పోరాడుతున్నారు. మ‌ధ్య‌లో ఎం. ఎ. ముఖీం అనేటోడు వ‌చ్చి అన్యాయంగా ఆ భూముల‌ను తెగ‌న‌మ్ముకోడానికి ఇన్నాళ్ల‌కు ప్ర‌భుత్వ యంత్రాంగం అడ్డుక‌ట్ట వేసింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ : పోలీస్ శాఖలో రూ 1.40 కోట్ల జీతాల కుంభకోణం..
కరీంనగర్ జిల్లాలో మరణించిన పోలీసు కానిస్టేబుళ్ల పెర్లతో జీతాలు డ్రా చేస్తున్న భారీ కుంభకోణం...
By Sunka Santhosh 2026-04-09 17:47:09 0 261
Andhra Pradesh
అన్నమయ్య: వాట్సప్ గ్రూప్ అడ్మిన్ లకు ఎస్సై వార్నింగ్
వాట్సప్ గ్రూపులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసభ్యకర పోస్టులు తప్పుడు ప్రచారం చేస్తే అడ్మిన్ల పైన...
By Benguluri Madhubabu 2026-07-13 06:21:47 0 239
Andhra Pradesh
పుంగనూరు:మాజీ ఎంపీ రెడ్డెప్పతో పాటు మరో 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
పుంగనూరులో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో నిరసన తెలిపిన 33 మంది వైసీపీ నేతలపై కేసు...
By Kothuru Murali 2026-06-07 06:16:25 0 146
Andhra Pradesh
ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో కలిసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) సుప్రియ రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ
37వ జాతీయ రహదారి భద్రత మహోత్సవాల సందర్భంగా, పుంగునూరు పట్టణంలో ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో...
By Kothuru Murali 2026-01-07 12:54:33 0 220
Telangana
లొయోలా అకాడమీలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 1976లో స్థాపించబడిన లొయోలా అకాడమీ తరువాత, తన 49 ఏళ్ల విశిష్ట...
By Sidhu Maroju 2025-11-08 15:32:08 0 319
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com