భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో మరింత వేగం పెంచాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

0
256

హనుమకొండ, ఏప్రిల్ 10:భద్రకాళి చెరువు పూడికతీత పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం భద్రకాళి చెరువులో కొనసాగుతున్న పూడికతీత పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం కాజీపేట మండలం అమ్మవారిపేటలోని ప్రభుత్వ స్థలాలలో డంపింగ్ చేస్తున్న పూడిక మట్టిని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా చెరువులో జరుగుతున్న పూడికతీత పనుల పురోగతిని తెలుసుకుని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. భద్రకాళి చెరువులో తీస్తున్న పూడిక మట్టిని ప్రభుత్వ భూముల్లో క్రమపద్ధతిలో నిల్వ చేయాలని, భూముల పరిరక్షణకు ఇది ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పూడికతీత పనులను మే 15 నాటికి పూర్తిచేసే విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అమ్మవారిపేటతో పాటు ఇతర ప్రాంతాలలో పూడిక మట్టిని నిల్వ చేస్తున్న ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.మొత్తం 7.70 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత పూర్తయిందని, మిగిలిన పనులను వేగవంతం చేసి లక్ష్యాన్ని సమయానికి చేరుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తాగునీటి పారుదల శాఖ ఈఈ కిరణ్ కుమార్, డిఈ మధుసూదన్ రెడ్డి, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఏఈ శ్యామ్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
వరి ధన్యానికి ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలనీ రోడ్డుపై బైటయించిన బీజేపీ శ్రేణులు
మంచిర్యాల జిల్లా : కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి డిమాండ్...
By Avunoori Mahesh 2026-05-06 15:18:46 0 190
SURAKSHA
The Iron Shield of Integrity: The Distinguished Career of Kranti Rana Tata, IPS
Leading with Valor: How One Officer’s Unwavering Commitment is Shaping a Safer Tomorrow In...
By Kalaga Sailaja 2026-07-13 12:25:36 0 137
SURAKSHA
S. Nagalakshmi, IAS: Excellence in Governance
A Dedicated Civil Servant Advancing Transparent Administration, Citizen-Centric Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 04:23:32 0 698
Andhra Pradesh
రౌండ్ టేబుల్ సమావేశం: అంజుమన్ & వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ
గంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం (Round...
By John Baji 2025-12-25 13:55:42 0 261
Telangana
Fifa world cup
హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో విద్యార్థులతో కలిసి ఫీఫా ప్రపంచ కప్ (అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్)...
By G k Nookala 2026-07-07 17:09:46 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com