నేడు ఏపీ కేబినెట్ భేటీ ..ఈ కీలక అంశాలపై చర్చ.

0
143

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి సహా పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా సుమారు రూ.39,436 కోట్ల విలువైన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలవనుంది.

 

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 31 ప్రాజెక్టులకు కేబినెట్ లాంఛనంగా ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు, విద్యా రంగంలో ఫీజుల నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్ఆర్‌సీ) ఏర్పాటుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ‘క్వాంటమ్ వ్యాలీ’లో మూడు సంస్థల స్థాపనపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

 

రాజధాని అమరావతి నిర్మాణం, వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం 28 జిల్లాలకు కొత్త జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశం కూడా ఎజెండాలో ఉంది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు, బదిలీలు ఈ కొత్త విధానంలోనే జరగనున్నాయి. అమరావతికి రాజధాని హోదా కల్పిస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది.

 

కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్లాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

Search
Categories
Read More
Andhra Pradesh
APSDMA: ఏపీకి ఎండల హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!
గత ఏడాదితో పోలిస్తే కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం మార్చి నుంచే పలు జిల్లాల్లో సాధారణం కంటే...
By Pagadala Venkateswar 2026-03-05 04:04:46 0 175
Andhra Pradesh
మదనపల్లి: మానవత్వం పరిమళించేలా హెల్పింగ్ మైండ్స్.
మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్‌లో మంగళవారం భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి మృతి...
By Pagadala Venkateswar 2026-01-28 10:00:44 0 187
Andhra Pradesh
అంబటి రాంబాబు బెయిల్‌ పిటీషన్‌పై నేడు వాదనలు.
గుంటూరు లీగల్‌: మాజీ మంత్రి, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు,...
By John Baji 2026-02-05 05:39:13 0 589
Telangana
రవాణా శాఖ అధికారిని బలికొన్న బొగ్గు టిప్పర్
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామ పరిధిలోని భూపాలపల్లి పర్కాల ప్రధాన రోడ్డుపై ఉన్న...
By Sriramula Anil 2026-06-23 01:35:29 0 294
Andhra Pradesh
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సి ఐ టి యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ ఎమ్మిగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు అంగన్వాడీ యూనియన్...
By Boya Dasthagiri 2026-03-31 23:59:08 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com