అమరావతి అభివృద్ధికి కీలక ముందడుగు.. రూ.2,534 కోట్లతో కేంద్ర సచివాలయం.

0
273

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపడంతో నిర్మాణ కార్యకలాపాల్లో కదలిక మొదలైంది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. మొత్తం రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపింది.

 

ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.1,299.08 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం సెంట్రల్ సెక్రటేరియట్, రూ.1,234.91 కోట్లతో ఉద్యోగుల కోసం నివాస సముదాయాలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సీఆర్డీఏ ఇప్పటికే 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సచివాలయం, మిగిలిన 17 ఎకరాల్లో నివాస భవనాలు నిర్మిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ శాఖ పంపిన ప్రతిపాదనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

 

మరోవైపు, అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కూడా ఖరారైంది. ఇక్కడి రాయపూడిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 787 సెంట్ల భూమికి సంబంధించిన లీజు అగ్రిమెంట్‌ ప్రక్రియ బుధవారం పూర్తయింది. సీఆర్డీఏ, కాగ్ అధికారుల మధ్య ఒప్పంద పత్రాల మార్పిడి జరిగింది. ఇదే క్రమంలో, 10 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామని హడ్కో కూడా ఆసక్తి చూపడం విశేషం.

Search
Categories
Read More
Telangana
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బర్రె మృతి
మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి పూర్రా విట్టల్ కి చెందిన బర్రె మృతి...
By Gandla Vaijanath 2026-07-04 05:15:34 0 251
Andhra Pradesh
మంగళగిరి నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్
*మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్*  ...
By Rajini Kumari 2026-03-09 17:23:45 0 222
Himachal Pradesh
Himachal Boosts Apple and Horticulture Sector in 2026
Himachal Pradesh continues to strengthen its apple and horticulture sector through initiatives...
By Fathima Safa 2026-07-06 06:37:47 0 159
Andhra Pradesh
వైయస్ షర్మిల రెడ్డి APCC చీఫ్ కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
scroll    విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-28 09:46:26 0 219
Telangana
ఇంటికి వెళ్లి పరామర్శించి నా మేయర్ దర్ని మధుకర్
   మంచిర్యాల: జూన్ 26 మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ కు...
By Pinnehasan Odela 2026-06-26 13:48:40 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com