చీరాల జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మర తనిఖీలు

0
479

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు రాత్రిపూట ముమ్మర తనిఖీలు నిర్వహించారు. డి.ఎస్.పి మోయిన్, సీఐ సుబ్బారావుల పర్యవేక్షణలో ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్ తన సిబ్బందితో కలిసి రహదారిపై ప్రయాణించే లారీలు, బస్సులను నిలిపి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులకు డ్రైవర్లకు ఎస్సై పవన్ కుమార్ పలు భద్రతా సూచనలు చేశారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే ట్రావెల్స్ బస్సులు, లారీలు ముందుగా వాహన ఫిట్నెస్‌ను సరిచూసుకోవాలని, కండిషన్‌లో ఉన్న వాహనాలతోనే ప్రయాణించాలని సూచించారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం సంభవిస్తుందని, అటువంటి పనులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

రాత్రి వేళల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే, వెంటనే వాహనాన్ని పక్కకు నిలిపి, ముఖం కడుక్కుని కాసేపు విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాల పట్ల అప్రమత్తం చేశారు. ప్రతి వాహనదారుడు తమ వెంట వాహనానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను కచ్చితంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై పవన్ కుమార్ హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
" ఐపీఎస్ ‘ఖద్దరు’ కడితే.. బహుజన ‘ఆశ’ గడీల పాలైందా?
హైదరాబాద్ : ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం, సిద్ధాంతాల ఘర్షణపై ప్రత్యేక...
By Sidhu Maroju 2026-05-21 17:43:08 0 531
Andhra Pradesh
పుంగనూరు: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
బుధవారం తిరుమల శ్రీవారిని పుంగనూరు శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ...
By Kothuru Murali 2026-06-17 16:25:29 0 118
Jammu & Kashmir
"Book Raids in Kashmir Spark Free Speech Debate"
Srinagar, Jammu&Kashmir- Authorities in Srinagar conducted raids on several bookstores,...
By BMA ADMIN 2025-08-11 10:09:18 0 2K
Delhi - NCR
Parliament’s Both Houses Adjourned Amid Uproar
New Delhi: The proceedings of both the Lok Sabha and Rajya Sabha were adjourned today following...
By BMA ADMIN 2025-08-11 11:21:30 0 2K
Andhra Pradesh
ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ.
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
By Pagadala Venkateswar 2026-07-06 08:57:00 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com