పెట్రోల్‌ ఉచితంగా పంచుతోన్న హైదరాబాదీ.. ‘భాయ్, భారత్ మాతా కీ జై అనొద్దు ఇక్కడ’.. వీడియో వైరల్

0
241

దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పదే పదే చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉంటున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద వందలాది వాహనాలు క్యూలో ఉంటున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. వాహనదారులంతా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటుడటంతో.. బంకుల్లోని పెట్రోల్ గంటల వ్యవధిలోనే అయిపోతోంది. దీంతో మరింత ఆందోళన చెందుతోన్న జనం.. పెట్రోల్ కోసం బంకుల ముందు ఎగబడుతున్నారు.

‎ఇలాంటి పరిస్థితుల్లో సయద్ అయుబ్ అనే హైదరాబాదీ ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. చెరకు రసం విక్రయించే బాటిళ్లలో పెట్రోల్ నింపి ఆటోడ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లాంటి వారికి ఫ్రీగా అందిస్తున్నారు. అయితే ఓ పెట్రోల్ బంకు వద్ద ఆయన ఉచితంగా పెట్రోల్‌ను అందించే క్రమంలో కొందరు భారత్ మాతా కీ జై అని నినాదాలు చేశారు. దీనికి స్పందించిన అయూబ్.. ‘భాయ్, భారత్‌ మాతా కీ జై లాంటి నినాదాలు చేయకండి. భారతదేశానికి సమస్య వచ్చినప్పుడు, అండగా ఉండటంలో భారతీయ ముస్లింలు ఎప్పుడూ ముందే ఉంటున్నారు. మీరు ఇలా చేయకండి, మతాన్ని ఇందులోకి తీసుకురాకండి. ఇక్కడ హిందువులు, ముస్లింలంతా ఒక్కటే’’ అని అయూబ్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రతికూలంగా స్పందిస్తున్నారు. భారత్ మాతా కీ జై మతపరమైన నినాదం అంటే.. వంద రూపాయల పెట్రోల్ కోసం.. నినాదాలు చేయడం ఆపేస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో అలాంటి నినాదాలు చేయాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

‎ఎవరీ అయూబ్..?సయద్ అయూబ్ హైదరాబాద్ యూత్ కరేజ్ (హెచ్‌వైసీ) అనే సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా సామాజిక సేవ చేస్తుంటారు. ఆహరం పంపిణీ, ఉచితంగా పెట్రోల్ పంచడం, గాజా బాధితులకు సాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. హెచ్‌వైసీ సంస్థ హైదరాబాద్‌లో కిస్మత్‌పుర నుంచి ఈ కార్యక్రమాలను చేపడుతోంది. క్రౌడ్ ఫండింగ్ నిధుల విషయంలో మోసం జరిగిందనే ఆరోపణలతో సైదాబాద్ పోలీసులు గతంలో అయూబ్‌‌తోపాటు సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.

‎ఆటోడ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌కు ఫ్రీగా పెట్రోల్..

‎అయూబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలను పరిశీలిస్తే.. గత రెండు రోజులుగా ఆయన ఉచితంగా పెట్రోల్ అందిస్తున్నారని అర్థమవుతోంది. ‘‘పెట్రోల్ బంకుల వద్ద భారీ సంఖ్యలో జనం ఉంటున్నారు.. చాలా మంది పెట్రోల్ విషయంలో ఆందోళన చెందుతున్నారు. దీంతో పెట్రోల్ కొట్టించుకోవడం చాలా కష్టంగా మారింది.. దీని వల్ల డెలివరీ బాయ్స్ లాంటి వారిపై ప్రభావం పడుతోంది.. అందుకే మేము ఫ్రీ పెట్రోల్ డ్రైవ్ మొదలుపెట్టాం. రెండు రోజులుగా మేము ఇలా చేస్తున్నాం. రాత్రి సమయాల్లో బంకులు మూతపడుతున్నాయి. 3-4 రోజుల్లో విక్రయించే పెట్రోల్‌‌ను 3-4 గంటల్లోనే విక్రయిస్తున్నామని.. అందుకే మేం బంకులు మూసేస్తున్నామని పెట్రోల్ బంక్ యాజమానులు చెబుతున్నార’’ని సయద్ అయుబ్ వెల్లడించారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్బిఐ కీలక నిర్ణయం డబ్బులు కట్టయ్యేముందె సిగ్నల్
ఆర్బీఐ కీలక నిర్ణయం..డబ్బులు కట్ అయ్యే ముందే అలర్ట్*   డిజిటల్ చెల్లింపుల భద్రతకు RBI...
By Rajini Kumari 2026-04-23 12:56:27 0 209
Dadra &Nager Haveli, Daman &Diu
Monsoon Update: Heavy Rain Expected Across DNH & Daman
The India Meteorological Department (IMD) has officially confirmed the onset of the monsoon...
By Lokeshwari Panthadi 2026-06-27 09:54:55 0 180
Andhra Pradesh
మై టిడిపి యాప్ ను ప్రారంభించిన తెలుగుదేశం యువ నాయకులు మౌర్యా రెడ్డి గారు
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చిన్న ముక్క పల్లె గ్రామంలోని రాజుల కాలనీలో మై టిడిపి పోస్టర్...
By Benguluri Madhubabu 2026-02-22 06:44:19 0 253
Andhra Pradesh
పెద్ద దోర్నాల మండలం రీ సర్వే గ్రామ సభ అవగాహన ర్యాలీ
పెద్ద దోర్నాల రీ సర్వే గ్రామ సభ అవగాహన కార్యక్రమం దోర్నాల సచివాలయం -1 లో నిర్వహించడం జరిగింది.......
By Chennaiah Kati 2025-12-26 06:41:41 0 457
Andhra Pradesh
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్: డీఎస్పీ పావని.
మదనపల్లె మండలం కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు...
By Pagadala Venkateswar 2026-04-20 03:24:20 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com