Chandrababu: తిరుమల వీధుల్లో నడుస్తూ.. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.

0
204

సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కుమారుడైన దేవాన్ష్ జన్మదిన వేడుకలు శనివారం తిరుమలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు తిరుమల వీధుల్లో నడుస్తూ సామాన్య భక్తులతో ముచ్చటించారు. శ్రీవారి దర్శనం త్వరితగతిన పూర్తయ్యేలా చూసేందుకు త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నట్టు భక్తులకు హామీ ఇచ్చారు.

 

ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, మంత్రి లోకేశ్‌, దేవాన్ష్ కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

 

దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని, శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఒకరోజు వితరణ ఖర్చు కింద రూ.44 లక్షల భారీ విరాళాన్ని నారా కుటుంబం అందజేసింది. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్‌, దేవాన్ష్ స్వయంగా భక్తులకు అల్పాహారం వడ్డించి, వారితో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.

 

ఈ కార్యక్రమాల తర్వాత సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ దిగి తిరుమల మాడ వీధుల్లో కొద్దిసేపు కాలినడకన పర్యటించారు. ఈ సమయంలో భక్తులను ఆపి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాదం నాణ్యత ఎలా ఉందని ప్రశ్నించగా, చాలా బాగుందని భక్తులు బదులిచ్చారు. దర్శనం మరింత వేగంగా జరిగేలా చూడాలని పలువురు భక్తులు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. భక్తుల సౌకర్యం కోసమే టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, దర్శన ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏఐ టెక్నాలజీని తీసుకువస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర, పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నేతన్నలకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మరో గుడ్ న్యూస్
*నేతన్నలకు ‘త్రిఫ్ట్’ గిఫ్ట్*   * రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత *...
By Rajini Kumari 2026-01-20 11:07:57 0 197
Andhra Pradesh
కారుతో బీభత్సం సృష్టించిన విద్యార్థి.
కురబలకోట రైల్వే ఫ్లైఓవర్‌పై బుధవారం ఒక విద్యార్థి అతివేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి...
By Pagadala Venkateswar 2026-03-04 11:39:37 0 187
Andhra Pradesh
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు , సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి , ఐ.ఏ.ఎస్ గారు  కలిసి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు.
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు ,...
By Gadiyapudi Narendra 2026-01-07 10:07:30 0 263
Andhra Pradesh
వనమలదిన్నెలో వృద్ధుడిపై దాడి
పుంగనూరు మండలం, వనమలదిన్నె గ్రామంలో భూ వివాదంలో 90 ఏళ్ల వెంకటస్వామిపై ఆయన బామ్మర్ది శ్రీరాములుతో...
By Kothuru Murali 2026-06-09 13:33:04 0 105
Andhra Pradesh
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలన
గుంటూరు ఫిబ్రవరి 4: గుంటూరు నగరంలోని కె.వి.పి కాలనీలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను జిల్లా...
By John Baji 2026-02-04 15:15:25 0 646
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com