Chandrababu: తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన.

0
219

సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి ప్రత్యేక సేవలో పాల్గొన్నారు.

 

శ్రీవారి దర్శనం పూర్తయ్యాక, ఆలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, దేవాన్ష్‌తో కలిసి కాలినడకన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో మాడ వీధుల గుండా వెళ్తూ దారిపొడవునా ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన భద్రతా సిబ్బందిని పక్కకు జరిపి, భక్తుల వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. పలువురు భక్తులతో ఆయన, మనవడు దేవాన్ష్ కలిసి ఫొటోలు దిగారు. భక్తులు దేవాన్ష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

అనంతరం అన్నదాన సత్రానికి చేరుకున్న చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఈ సేవలో పాల్గొనడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Arunachal Police Expand Foothill Infrastructure Network
The Arunachal Pradesh Police are rapidly expanding their physical footprint to ensure robust...
By Lokeshwari Panthadi 2026-07-04 08:53:56 0 146
Andhra Pradesh
CPI భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాలు
సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్ర రాజు గారి...
By Rajini Kumari 2025-12-26 09:47:44 0 471
Andhra Pradesh
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సూర్యోదయ సంస్థకు గోల్డెన్ నంది అవార్డు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో...
By Ratna Sekhar 2026-03-10 07:24:28 0 337
Andhra Pradesh
రెండు రోజులుగా కరెంట్ కష్టాలు
బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేట, ఇందిరమ్మ కాలనీ, ఐటీఐ కాలనీ, జగనన్న కాలనీకు రెండు రోజులుగా...
By Boiena Rajesh 2026-04-14 13:45:41 0 203
Andhra Pradesh
నల్లచెరువు MRCలో 31 మంది జాతీయ నాయకుల చిత్రపటాల అందజేత
భారత్ ఆవాజ్ న్యూస్: నల్లచెరువు మండల విద్యా వనరుల కేంద్రం (MRC) ఆధునీకరణ పనులు పూర్తికావడంతో...
By Vinod Kumar 2026-09-11 12:49:49 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com