Bharat Aawaz

​భద్రాచలం బస్టాండ్‌లో మొబైల్ దొంగకు దేహశుద్ధి: పోలీసులకు అప్పగింత

Lakavath Kiran
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
712
Views

భద్రాచలం:భద్రాచలం పట్టణంలోని ప్రధాన బస్టాండ్ ఆవరణలో ఆదివారం రాత్రి  ఒక మొబైల్ దొంగతనం కలకలం రేపింది. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని మొబైల్ కొట్టేస్తున్న వ్యక్తిని ప్రయాణికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఘటన వివరాలు:

చాకచక్యం: బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ఒక ప్రయాణికుడి జేబులో నుంచి మొబైల్ తీస్తుండగా, సదరు బాధితుడు గమనించి కేకలు వేశాడు.

ప్రజల స్పందన: దొంగ తప్పించుకునే ప్రయత్నం చేయగా, అక్కడే ఉన్న ఇతర ప్రయాణికులు, అతడిని వెంటాడి పట్టుకున్నారు.

దేహశుద్ధి: పట్టుబడిన వ్యక్తిని నిలదీయగా, అతని వద్ద నుంచి మరికొన్ని అనుమానాస్పద వస్తువులు లభ్యమైనట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన జనం అతడికి దేహశుద్ధి చేశారు.