తెలంగాణ రైతులకు శుభవార్త..మూడు విడతల్లో రైతు భరోసా తొలి విడత ఈనెల 22న

0
298

తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల నుంచి రైతు భరోసా డబ్బులు పడతాయని భావిస్తున్న రైతులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. ఎన్నికల వాగ్దానంలో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులకు ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 22వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా ప్రణాళిక వేసింది.ఈ కార్యక్రమాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఆయనే బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి తొలి విడత డబ్బులు వేయనున్నారు. దీంతో తొలి విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ కానున్నాయి.

‎గత కొంతకాలంగా రైతులు ఎంతో ఆశగా ఈ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకం ప్రారంభాన్ని సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా నర్మెట్ట నుంచి నిధులను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా డబ్బుల కోసం సీఎం రేవంత్ రెడ్డి.. ఆర్థికశాఖ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలతో చర్చించారు. అనంతరం ఈ నెల 22న రైతు భరోసా నిధులు విడుదలకు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ భరోసా డబ్బులు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి.రైతు భరోసా డబ్బులు మొదటి విడతలో ఈనెల 22న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వేస్తారు. తొలి విడతలో సుమారు 70 లక్షల మంది రైతులకు డబ్బులు వారి వారి అకౌంట్లలలో జమ కానున్నాయి. ఎకరం వరకు రూ.3,590 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మొదటి విడత డబ్బులు పడిన 20 రోజుల తర్వాత రెండో విడత డబ్బులు జమ చేస్తారు. రెండో విడతలో రూ.2,650 కోట్ల నిధులు విడుదల చేస్తారు. ఆ తర్వాత మూడో విడత డబ్బులు ఏప్రిల్ నెలాఖరును రైతుల ఖాతాల్లో చేరనున్నాయి. ఈ క్రమంలో మొత్తం మూడు విడతల్లో కలిపి మొత్తం రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

‎ 

Search
Categories
Read More
Andhra Pradesh
జీవించింది 55 ఏళ్ళు అయినా తరతరాలకు నిలిచిపోయే పేరు రఫీ సాబ్
జీవించింది_55_ఏళ్ళే_అయినా_తరతరాలకు నిలిచి_పోయే_పేరు_రఫీ_సాబ్_ది  ...
By Rajini Kumari 2025-12-24 10:47:11 0 225
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఏకే భాష గారు
ది.15-12-2025 న అమరి జీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ది బెజవాడ బార్ అసోసియేషన్ లో...
By Rajini Kumari 2025-12-16 07:55:58 0 219
Andhra Pradesh
ఏపీఎస్ఏహెచ్పిసి సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న నియామకం
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ కౌన్సిల్ సభ్యుడిగా తనను...
By Benguluri Madhubabu 2026-06-26 13:59:52 0 150
Andhra Pradesh
పుంగనూరు: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఎఫ్ఓ
పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం పెట్రోల్ బంక్ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్...
By Kothuru Murali 2026-03-17 06:58:53 0 207
Andhra Pradesh
తిరునాళ్ళలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన జిల్లా పోలీస్ అధికారులు.
  బాపట్ల జిల్లా: బాపట్ల ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్...
By Gadiyapudi Narendra 2026-02-17 16:05:42 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com