అడవి పంది ఢీకొన్న దివ్యచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు పంది మృతి

0
574

అడవి పందిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు, పంది మృతి

మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం గంటవాని పల్లె గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అడవి పందిని ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, అడవి పంది అక్కడికక్కడే మృతి చెందింది.

ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా ఉంగరాల దిబ్బ గ్రామానికి చెందిన దూలప్ప, శంకరప్ప అనే భక్తులు శ్రీశైలం దైవ దర్శనార్థం ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో గంటవాని పల్లె గ్రామ సమీపానికి చేరుకోగానే అకస్మాత్తుగా అడవి పంది రోడ్డుపైకి రావడంతో వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం దానిని ఢీకొని ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో అడవి పంది అక్కడికక్కడే మృతి చెందగా, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దూలప్ప, శంకరప్పలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Search
Categories
Read More
SURAKSHA
Shri Vinod P. Kavle: A Visionary IAS Driving Public Service
An AGMUT cadre officer whose administrative excellence reflects dedication, integrity, and...
By Kalaga Sailaja 2026-07-29 09:22:41 0 137
Andhra Pradesh
విన్నర్ రేంజ్‌లో రెమ్యునరేషన్.. 15 వారాలకు ఇమ్మాన్యుయేల్ ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు ముందే ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాడు. సీజన్...
By SivaNagendra Annapareddy 2025-12-21 11:09:49 0 271
Andhra Pradesh
ఒకపక్క దోమల సమస్య మరోపక్క విద్యుత్ సమస్య
నందవరం మండలం ముగతి గ్రామంలో ఒకపక్క దోమల సమస్య మరోపక్క విద్యుత్ కోతలు గ్రామాల్లో విద్యుత్ లేక...
By Boya Dasthagiri 2026-09-07 13:38:57 0 127
Chandigarh
Going Green: No-Car Wednesdays for Government Employees
In a major push for green living and fuel conservation, the Chandigarh Administration has...
By Dunna Jessicaruth 2026-05-20 06:53:03 0 97
Telangana
ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన భారత ఆవాజ్ రిపోర్టర్ రవి మహంకాళి
నిన్నా రాత్రి సమయంలో టిప్పర్ లారీ శరవేగానికి. బైక్ మీద వెళ్తున్నా ఒక యువకుడి బైక్ గుద్ది...
By Mahankali Ravi 2026-04-21 10:04:49 0 443
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com