ఇంద్రకీలాద్రి మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేసినేని శివనాథ్ జానకి లక్ష్మి

0
204

*ప్రచారుణార్ధం * *07.03.2026*

 

 *ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాద్, జానకి లక్ష్మి దంపతులు* 

- ఘన స్వాగతం పలికిన ఆలయ పాలకమండలి చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు , అధికారులు

 

 *విజయవాడ* :: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవంలో కేశినేని శివనాద్ (చిన్ని), జానకీ లక్ష్మి దంపతులు శనివారం పాల్గొన్నారు. ఎంపీ శివనాధ్ (చిన్ని), జానకీ లక్ష్మీ దంపతులకు ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) , ఆలయ ఈవో శీనా నాయక్ , ట్రస్ట్ బోర్డు సభ్యులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఎంపీ కేశినేని చిన్ని, జానకి లక్ష్మీ దంపతులు కనకదుర్గమ్మ అమ్మవారికి పసుపు కుంకుమ, పండ్లు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ బంగారు తాపడ రాజగోపురానికి నమస్కరించి ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ ఈవో అందజేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ అన్నారు. మహా కుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్ల తీరు తెన్నులను ఆలయ పాలకమండలి చైర్మన్, ఈవో ను అడిగి ఎంపీ శివనాద్ తెలుసుకున్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా మహా కుంభాభిషేక క్రతువును దిగ్విజయంగా జరిగేలా చూడాలని సూచించారు. ఎంపీ కేశినేని శివనాద్ దంపతులకు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎం. వెంకట రాఘవ రాజు, టి. పద్మావతి, మన్నే కళావతి, సుకాసి సరిత, వెలగపూడి శంకర్ బాబు స్వాగతం పలికిన వారిలో ఉండగా టి ఎన్ టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ: రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు.
చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్లలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం 46.85 లక్షల మంది...
By Pagadala Venkateswar 2026-06-20 13:37:20 0 105
Andhra Pradesh
చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
చీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే...
By Vadlamudi NagaVenkat 2026-04-02 09:10:15 0 604
Telangana
స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి : పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  రాజీవ్ గాంధీ 81 వ జయంతి సందర్భంగా  రాజీవ్ గాంధీ సర్కిల్...
By Sidhu Maroju 2025-08-20 13:53:09 0 609
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com