YS Sharmila: చంద్రబాబు పాపులేషన్ పాలసీపై షర్మిల సెటైర్.

0
202

Andhra

 

YS Sharmila Slams Chandrababus Population Policy

చంద్రబాబు జనాభా విధానంపై వైఎస్ షర్మిల వ్యంగ్యం

ఉన్న పిల్లలకే దిక్కులేదు.. ఇప్పుడు ముగ్గురు ఎందుకని ప్రశ్న

నిరుద్యోగులు ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటున్నారని ఆవేదన

రాష్ట్ర అప్పులు 12 లక్షల కోట్లకు చేరాయని మండిపాటు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా నియంత్రణ ఎత్తివేత, ఎక్కువ మంది పిల్లలను కనడంపై అసెంబ్లీలో చేసిన ప్రకటన పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.

 

"చంద్రబాబు పాపులేషన్ పాలసీ హాస్యాస్పదం. ఉన్న బిడ్డలకే దిక్కులేదు... ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనాలా? మీరిచ్చే బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా? ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆటోలు తోలుకుంటూ, ట్యాక్సీ డ్రైవర్లుగా బ్రతుకుతున్నారు. రాష్ట్రంలో మీరిచ్చిన హామీలు అమలు కాలేదు. మీరు, జగన్ గారు కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవు. ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్య శ్రీ పథకానికి 3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 6 వేల కోట్లు బకాయిలు పెట్టారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారు. మాఫియాలు చేసుకుంటూ, రాష్ట్రాన్ని దోచుకుంటూ... బిడ్డలను కనమని చెబితే ఎలా చంద్రబాబు గారూ?" అంటూ షర్మిల ధ్వజమెత్తారు.

Search
Categories
Read More
Lakshdweep
Lakshadweep Strengthens Water Resource Management
Lakshadweep continues to enhance water resource management by promoting sustainable freshwater...
By Fathima Safa 2026-06-29 08:11:56 0 98
Andhra Pradesh
మహారాష్ట్రకు చెందిన 5 గురు సభ్యుల డెకాయిటీ గ్యాంగ్‌ను చకచక్యంగా అదుపులోకి తీసుకున్న బాపట్ల జిల్లా పోలీసులు ఎస్పీ శ్రీ బి.ఉమా మహేశ్వర్ ఐపీఎస్ గారి నేతృత్వంలో కొనసాగిన ప్రత్యేక ఆపరేషన్
మహారాష్ట్రకు చెందిన 5 గురు సభ్యుల డెకాయిటీ గ్యాంగ్‌ను చకచక్యంగా అదుపులోకి తీసుకున్న బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-01-10 16:32:04 0 475
SURAKSHA
Large-Scale Recruitment of Police Constables
o strengthen law and order, the Karnataka Police has launched a major recruitment drive for 3,395...
By Kalaga Sailaja 2026-06-29 09:19:49 0 142
Andhra Pradesh
జాతీయ విలువిద్య పోటీలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం
మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర యువజన రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
By Benguluri Madhubabu 2026-03-24 12:03:13 0 256
Andhra Pradesh
మదనపల్లి: ప్రభుత్వ ప్రణాళికలకు జనగణనే ప్రాతిపదిక: కలెక్టర్.
ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు ఖచ్చితమైన జనగణన గణాంకాలే బలమైన పునాది అని...
By Pagadala Venkateswar 2026-02-28 06:28:14 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com