APSDMA: ఏపీకి ఎండల హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!

0
175

గత ఏడాదితో పోలిస్తే కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం

మార్చి నుంచే పలు జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

 

 

గుంటూరు, పల్నాడు, కర్నూలు సహా పలు జిల్లాల్లో తీవ్ర వడగాలుల ముప్పు

ప్రాణ నష్టం నివారణకు ముందస్తు చర్యలు చేపట్టిన విపత్తుల సంస్థ

రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ ఏడాది వేసవి తీవ్రత గతం కంటే ఎక్కువగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. 

 

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం..ఈ మార్చి నెల నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో ఎక్కువ రోజుల పాటు వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

 

 

 

మార్చి నుంచి మే నెలల మధ్య కాలంలో శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాలు మినహా మిగిలిన ప్రదేశాల్లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని సంస్థ అంచనా వేస్తోంది.

 

పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. జిల్లా యంత్రాంగాలతో సమన్వయం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించగలమని ఆయన తెలిపారు. ఎండల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారం కోసం ప్రజలు టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101లను సంప్రదించాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణం
విజయవాడ ధర్నా చౌక్ లో అనుమతితో నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని...
By Kothuru Murali 2026-03-04 06:48:02 0 204
Andhra Pradesh
సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.
మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-04-09 14:52:21 0 142
Bihar
Bihar Boosts Industrial Growth and Investment Drive
Bihar is steadily advancing its industrial growth and investment landscape through focused...
By Fathima Safa 2026-07-01 06:09:18 0 193
Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. కేబినెట్ నిర్ణయాలపై హర్షం.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సానుకూల నిర్ణయాలు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై నేతల...
By Pagadala Venkateswar 2026-06-24 04:32:34 0 109
Andhra Pradesh
పుంగనూరు: 450 సంవత్సరాల చరిత్ర గల గంగమ్మ జాతర మార్చి 10.11.
పుంగనూరులో ఈనెల 10, 11వ తేదీల్లో సుగుటూరు గంగమ్మ జాతరను నిర్వహిస్తున్నట్లు జమీందారులు మంగళవారం...
By Kothuru Murali 2026-03-04 06:58:18 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com