Bharat Aawaz

వేట్లపాలెం ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ

Ratna Sekhar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
2.1K
Views

సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధిత కుటుంబాలకు డీఎస్సీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆర్థిక సహాయం అందించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు అందించిన ఈ సహాయం కొంతైనా ఉపశమనం కలిగిస్తుందని స్థానికులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తానయుడు నిమ్మకాయల రంగనాగ్, రైస్ మిల్లర్స్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.