అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

0
195

*వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం*

 

*సతీసమేతంగా పాల్గొన్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్*

 

*స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు*

 

మంగళగిరి: మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 12 గం.లకు దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రభుత్వం తరపున నారా లోకేష్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక ఆశీర్వచనాలు పొందారు. అంతకుముందు దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. స్వామి వారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Narayan Konwar, IAS: A Pillar of Assam's Governance
The Journey Begins "Effective governance is built on integrity, accountability, and the...
By Fathima Safa 2026-07-22 13:37:01 0 97
BMA
The Developer Deficit: Building Games in Newsrooms
While the engagement potential of newsgames is massive, Indian media houses face a critical...
By JoinBMA 2026-08-21 18:54:47 0 352
Telangana
గ్రామ పంచాయతీ ఏడాది ఖర్చుల కోసం నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి
ఏడాది ఖర్చుల కోసం *15 th finance commission* ద్వారా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి కేంద్ర...
By Bouth Arun 2025-12-28 09:36:34 1 1K
Andhra Pradesh
ఏపీ ఆరోగ్య సూచన సలహాదారుడిగా డాక్టర్ మంతెన సత్యనారాయణ
*ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా డా.మంతెన సత్యనారాయణ రాజు*   ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు...
By Rajini Kumari 2025-12-30 10:28:08 0 245
Andhra Pradesh
పుంగనూరు: ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలంలో ఆదివారం భూమి వాదం కర్రల దాడికి దారితీసింది. స్థానికుల వివరాల...
By Kothuru Murali 2026-03-23 04:46:03 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com