JKSA: కర్నూలు నర్సింగ్ కాలేజీలో కశ్మీరీ విద్యార్థినులపై వేధింపులు.. సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు.

0
173

సీఎం చంద్రబాబు జోక్యం కోరుతూ జేకే స్టూడెంట్స్ అసోసియేషన్ లేఖ

రంజాన్ ఏర్పాట్లు, హిజాబ్‌పై ఆంక్షలు విధించారని ఆరోపణ

'ఉగ్రవాదులు' అంటూ దూషిస్తున్నారని విద్యార్థినుల ఆవేదన

నిష్పక్షపాత విచారణ జరిపి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

 

కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న కశ్మీరీ విద్యార్థినులపై వేధింపులు జరుగుతున్నాయని, ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని జమ్మూ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (జేకేఎస్ఏ) ఏపీ సీఎం చంద్రబాబు కోరింది. రంజాన్ మాసంలో ప్రత్యేక ఏర్పాట్లు నిరాకరించడం, హిజాబ్ ధరించవద్దని ఒత్తిడి చేయడం, మాటలతో దూషించడం వంటివి చేస్తున్నారని ఆరోపిస్తూ ఇవాళ‌ సీఎంకు లేఖ రాసింది.

 

జేకేఎస్ఏ జాతీయ కన్వీనర్ నాసిర్ ఖుహెమీ తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దాదాపు 24 మంది కశ్మీరీ విద్యార్థినులు ఈ ఫిర్యాదులు చేశారు. వీరిలో చాలామంది ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ స్కీమ్ (పీఎంఎస్‌ఎస్) కింద చదువుతున్న యువతులే. రంజాన్ మాసంలో సెహ్రీ, ఇఫ్తార్ కోసం ఏర్పాట్లు చేయమని కోరగా, "మతపరమైన ఆచారాలు పాటించాలనుకుంటే కాలేజీలో ఎందుకు చేరారు?" అని యాజమాన్యం ప్రశ్నించిందని విద్యార్థులు ఆరోపించారు.

 

తమ కశ్మీరీ గుర్తింపు, మతం ఆధారంగా లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉగ్రవాదులు’, ‘ఇడియట్స్’ వంటి పదజాలంతో దూషిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిజాబ్ తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారని, ఇది తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని జేకేఎస్ఏ తెలిపింది. ఈ ఘటనల వల్ల విద్యార్థినులు భయం, అవమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఇది వారి చదువుపై ప్రభావం చూపుతోందని వివరించింది.

 

ఈ విషయంపై తక్షణమే స్పందించి, నిష్పక్షపాత విచారణకు ఆదేశించాలని చంద్రబాబును జేకేఎస్ఏ కోరింది. విద్యార్థినుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాలని, భయం లేకుండా చదువుకునే వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. విద్యాసంస్థలు అందరికీ సురక్షితమైన ప్రదేశాలుగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొం ది.

Search
Categories
Read More
SURAKSHA
Rajeev Verma, IAS: Leading Chandigarh with Vision & Integrity
The Journey Begins A Leader Committed to Public Service "Good governance is not merely about...
By Fathima Safa 2026-07-23 04:29:56 0 107
SURAKSHA
Pranab Jyoti Goswami IPS: Leading Assam With Integrity
A dedicated IPS officer of the Assam-Meghalaya Cadre, Pranab Jyoti Goswami has built a...
By Lokeshwari Panthadi 2026-08-03 13:05:15 0 246
Telangana
నడిరోడ్డుపై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్ . ‎
ఇటీవల మణికొండలోని అల్కాపూర్ టౌన్ షిప్ లో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి...
By Ponnala Srinivasrao 2026-05-25 02:34:26 0 158
SURAKSHA
Vakati Karuna, IAS: Transforming Governance with Compassion
From district administration to public health and rural development, Vakati Karuna, IAS, has...
By Lokeshwari Panthadi 2026-07-14 06:48:24 0 182
Andhra Pradesh
కృష్ణ ఫౌండేషన్ ద్వారా నిర్మించిన గ్రామం ముఖద్వారం ప్రారంభోత్సవం పామర్రు ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర
18/1/2026. పెరిసెపల్లి గ్రామం, పామర్రు మండలం.    *సమాజంలో అట్టడుగున ఉన్న పేదల...
By Rajini Kumari 2026-01-18 14:31:34 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com