Nara Lokesh: తమ్ముడూ.. నువ్వు లేవని, ఇక రావని అంటే నమ్మడం కష్టంగా ఉంది: నారా లోకేశ్.

0
184

గుండెపోటుతో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం మృతి

మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

విజయవాడలో పార్టీ కార్యక్రమాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న వైనం

 

తెలుగుదేశం పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ యువజన విభాగమైన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. యువ నాయకుడి అకాల మరణం పట్ల రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగభూషణంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ లోకేశ్ భావోద్వేగానికి గురయ్యారు.

 

ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఒక సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. "తమ్ముడూ.. నువ్వు లేవని, ఇక రావని అంటే నమ్మడం కష్టంగా ఉంది. భూషణం అని పిలిస్తే.. ఈ అన్న ముందు వాలిపోయేవాడివి" అంటూ లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో టీఎన్ఎస్ఎఫ్ కార్యక్రమాలను నాగభూషణం తన భుజాలపై వేసుకొని సమర్థంగా నిర్వహించారని, తెలుగు యువతకు ఆయన ఒక బలమని కొనియాడారు.

 

"ఇంతలోనే అనారోగ్యం నిన్ను కాటేసింది" అంటూ విచారం వ్యక్తం చేశారు. నాగభూషణం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. నాగభూషణం మృతి పట్ల పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Ashok Barnwal: Steering Madhya Pradesh with Vision
From a distinguished 1991-batch IAS officer to Acting Chief Secretary of Madhya Pradesh, Ashok...
By Lokeshwari Panthadi 2026-07-23 05:05:17 0 136
SURAKSHA
Sanjay Jaju, IAS: Architect of Good Governance
The Administrator Shaping Telangana's Future Through Visionary Leadership    "True...
By Lokeshwari Panthadi 2026-07-09 06:10:45 0 167
Andhra Pradesh
మదనపల్లి: మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం- ఎస్పీ.
మదనపల్లిలోని మిట్స్ (MITS) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో జిల్లా పోలీస్ శాఖ, యాజమాన్యం సంయుక్తంగా 'సే...
By Pagadala Venkateswar 2026-02-07 09:42:07 0 211
Andhra Pradesh
మదనపల్లె కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు.
మదనపల్లె మార్కెట్ కు రైతులు టమాటాలు తీసుకురావడం మానేశారు. ఇతర రాష్ట్రాలలోనూ పంటలు ఉండటంతో రేట్లు...
By Pagadala Venkateswar 2026-02-16 05:02:45 0 202
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్
రాయచోటి రూరల్ మండలం చిన్న ముక్క పల్లి గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో...
By Benguluri Madhubabu 2026-02-28 02:32:42 0 379
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com