బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్డు నందు యర్ర కాలువ లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీట వంశీ, వేటగిరి చందు ల మృతి బాధాకరం
Posted 2026-02-24 17:02:29
0
230
బాపట్ల మండలం: బాపట్ల మండలం అప్పికట్ల రహదారిలోని నాగరాజు కాలువలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన విషాద సంఘటనపై బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా విషాదకరమైన సంఘటనగా పేర్కొన్నారు.
చిన్నవయసులోనే యువకులు మృత్యువాత పడటం తనను కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాగరాజు
కాలువలో ఈత కొడుతూ పిట్టల వాని పాలెం మండలం పోతన కట్ట వారి పాలెం చెందిన పీటా లీలా వంశీకృష్ణ, బాపట్ల మండలం కనకాద్రి నగర్ యాటగిరి చందు ఈ సంఘటనలో దుర్మరణం చెందారు. ఆయా కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. దురదృష్టకరమైన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రమాదకరమైన నాగరాజు కాలువలో ఎవ్వరూ మునగటానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచన చేశామని తెలిపారు. ప్రమాద హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేయాలని సూచన చేశామని అన్నారు. జరిగిన సంఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
బాపట్ల జిల్లా అప్పికట్ల రోడ్డు నందు యర్ర కాలువ లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన పీట వంశీ, వేటగిరి చందు ల మృతదేహాలను బాపట్ల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ బోటు ద్వారా బాపట్ల అగ్నిమాపక అధికారి జి రామ సిద్ధార్థ ఆధ్వర్యం లో రెస్క్యూ టీం బృందాలను కాలువ వద్దకు పిలిపించి పోలీసులు, గజ ఈతగాళ్లు, రెవెన్యూ సిబ్బంది సాయం తో గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు (24-02-2026) న మృతదేహాన్ని కాలువ నుండి వెలికి తీసి పోలీసులకు అప్పగించడం జరిగింది.
ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని గ్రామ ప్రజలు మరియు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ K.Vinay గారు అభినందించారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
High-Altitude Irrigation Canal Inaugurated at 14,000 Feet
In a major boost to water security, Ladakh’s high-altitude Changthang region received its...
AP Retired Cops: Blood Donors Saving Lives Daily
Yesterday retire అయిన AP police officers blood donation కి ముందు వరుసలో నిలబడ్డారు. "Raktam...
దేశ భవిష్యత్తు నిర్ణయంలో యువత పాత్ర కీలకం.
అన్నమయ్య జిల్లా జేసీ శివ నారాయణ శర్మ ఆదివారం మదనపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా...
పోలీస్ స్టేషన్లో ప్రమాదం సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు
మహబూబాబాద్ : మరిపెడ పోలీస్ స్టేషన్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంతో కాలంగా...
గుంటూరు జిల్లాSP శ్రవణ్ కుమార్ జిందల్IPS గారు అవగాహన కార్యక్రమం
*ప్రెస్ నోట్*
*గుంటూరు జిల్లా పోలీస్...*
*తేది: 23.12.2025*
_*//రోడ్డు ప్రమాదాలు మరియు...