కల్తీ పాల మృతుల కేసులో సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్షల పరిహారం

0
192

*Press Release*

 

*కల్తీపాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం*

 

*శాసనసభలో ప్రటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు* 

 

*నివేదిక రాగానే బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి*

 

*అమరావతి, ఫిబ్రవరి 23 :-* రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో కల్తీపాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటనపై శాసన సభలో మాట్లాడిన సీఎం...బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

 

*కల్తీపాల ఘటన చాలా బాధాకరం*

 

శాసన సభలో రాజమహేంద్రవరం ఘటనపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...‘రాజమహేంద్రవరం ఘటనలోని బాధితులు వాంతులు, కడుపునొప్పి, డయాలసిస్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్లీనికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయి పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో వరలక్ష్మీ మిల్క్ డెయిరీ 106 కుటుంబాలకు రోజూ పాల సరఫరా చేస్తోంది. ఈ డెయిరీ నుంచి వచ్చిన పాలను తాగి అనారోగ్యం పాలయ్యారని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో 8 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ముగ్గురు 70 ఏళ్లకు పైబడిన వారు, ఒకరు 58 ఏళ్ల వయసు వారు ఉన్నారు. బాధితుల నుంచి నమూనాలను తీసుకుని హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్స్‌కు పరీక్షల కోసం పంపించాం. డెయిరీ నిర్వాహకుడు అద్దాల గణేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కాసులకు కక్కుర్తి పడి ఈ కల్తీ వ్యవహారానికి పాల్పడితే సీరియస్‌గా తీసుకుంటాం. విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసకుంటాం. రాష్ట్రంలో ఎవరైనా కల్తీకి పాల్పడినా, ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు...అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 

 

*అసెంబ్లీలోని ఛాంబర్‌లో సమీక్ష*

 

రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్‌, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో పాల వినియోగంతో స్థానికులు అస్వస్థతకు గురవడం, పలువురు మరణించారన్న ఘటన తెలియగానే ఉదయమే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షించి ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యసాయంపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. పాలు వినియోగించిన కుటుంబాల్లోని 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని, మిగిలిన వారందరి నుంచి కూడా నమూనాలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై మరోసారి అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మంత్రులు, అధికారులతో మధ్యాహ్నం సీఎం చంద్రబాబు సమీక్షించారు.  

******

Search
Categories
Read More
Health & Fitness
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?
ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే.. అతనితో మాట్టాడటమో, లేదా కాసేపు సమయం గడపడమో చేయాలి.....
By SivaNagendra Annapareddy 2025-12-24 06:42:13 0 321
Telangana
రాష్ట్ర వేడుకగా వాసవి జయంతి, ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు...
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని...
By Nookapangu Manikanta 2026-04-25 11:47:01 0 179
Telangana
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా:    అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు....
By Sidhu Maroju 2025-07-10 16:12:41 0 1K
Uttarkhand
Uttarakhand Strengthens Disaster and Climate Resilience
Uttarakhand has intensified its focus on disaster management and climate resilience to address...
By Fathima Safa 2026-06-16 12:06:03 0 107
Telangana
మంచిర్యాలలో TVS ఈ-వెహికల్ షోరూమ్ ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన...
By Avunoori Mahesh 2026-09-02 10:44:04 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com