*టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య* .

0
288

*టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య* 

ఏపీ – మంగళగిరి మండలం: పెదవడ్లపూడిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. టీవీ సౌండ్ తగ్గించమన్న విషయంపై జరిగిన వాగ్వాదం చివరికి హత్యకు దారితీసింది.

పోలీసుల సమాచారం ప్రకారం, పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ (26) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి నివసిస్తున్నారు.

క్రాంతికి గతంలోనే వివాహం కాగా, ఆమె భర్త ఓ నేరంలో జైలులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత షేక్ అహ్మద్‌ను రెండో వివాహం చేసుకుంది.

గురువారం రాత్రి ఇంట్లో టీవీ సౌండ్ తగ్గించమన్న అహ్మద్‌తో క్రాంతికి వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో క్రాంతి కత్తితో అహ్మద్‌ను పొడిచినట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్రాంతిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా 27-01-2026 Tue 15:46 | Andhra Pawan Kalyan...
By Pagadala Venkateswar 2026-01-28 10:39:12 0 187
Odisha
Electoral Rolls: EC Announces Special Intensive Revision
In a major administrative move, the Election Commission of India announced today that a...
By Dunna Jessicaruth 2026-05-15 11:39:14 0 282
Andhra Pradesh
కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్
పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు...
By Ratna Sekhar 2026-02-19 20:16:08 0 2K
BMA
The SoJo Syllabus: Retraining India's Student Press
The curriculum in Indian mass communication institutes is undergoing a vital transformation....
By JoinBMA 2026-08-22 04:24:10 0 158
Business & Finance
Three Additional Strategic Oil Reserves
The Indian government is considering setting up three additional strategic oil reserves, in...
By Bharat Aawaz 2025-07-03 08:13:47 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com