-
60 Posts
-
2 Photos
-
0 Videos
-
Reporter at Bharath awaaz, Hyderabad
-
Studied Electronics and Communication Engineering at JNTUH UniversityClass of B Tech
-
Followed by 2 people
-
Current Position
Non-Working
-
State
Telangana -
Assembly Constituency
Paleru -
District
Khammam -
Mandal | Tahasil | Sub Division
Nelakondapalli
Recent Updates
-
7 కోట్ల 30 లక్షలతో నిర్మించబోతున్న గార్మెంటరీ యూనిట్‌కు గంగాపురి వద్ద మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపనఉపాధి అవకాశాల విస్తరణకు తోడ్పడే విధంగా రూ. 7 కోట్లు 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే గార్మెంటరీ యూనిట్‌కు గంగాపురి వద్ద శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ గార్మెంటరీ యూనిట్ ద్వారా స్థానిక మహిళలు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు....0 Comments 0 Shares 329 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
రేవంత్ రెడ్డి హయాంలో బీహార్ రాష్ట్రాలకంటే దౌర్భాగ్య పరిస్థితులుకేసీఆర్ గారి హయాంలో పంట సాగులో తెలంగాణ పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటి మొదటి స్థానంలో నిలిచింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకంటే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి కరీంనగర్ పట్టణంలో ఉదయం 11 గంటలకు తుపాకులతో చొరబడి జ్యూవెలరీ షాపులో దొంగతనం చేశారు ఘటన జరిగి ఇన్ని గంటలు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారు – కేటీఆర్0 Comments 0 Shares 354 Views 0 Reviews
-
పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య...భద్రాచల శ్రీరాముల వారి పట్టాభిషేకం శనివారం వైభవంగా జరిగింది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. తరువాత పాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణ కిరీటం, ఖడ్గం, రత్నాభరణాలతో స్వామివారికి రాజ లాంఛనాలు అలంకరించి పట్టాభిషేకం జరిపారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద పారాయణాలతో పాటు విష్ణు పురాణం, భగవత్ శాస్త్ర పారాయణాలు జరిగాయి. పుష్కర జలాలతో మహాకుంభ తీర్థప్రోక్షణ, హారతులు సమర్పించారు.0 Comments 0 Shares 439 Views 0 Reviews
-
అర్హులైన పేదలందరికీ న్యాయం చేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు...వెలుగుమట్ల భూముల వ్యవహారంలో అర్హులైన పేదలెవరైనా సరే, వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం వెలుగుమట్లలో పర్యటించిన ఆయన.. క్షేత్రస్థాయి పరిస్థితులపై కలెక్టర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదేళ్లుగా సంఘాల పేరుతో ప్రజలను పక్కదోవ పట్టించి, ఇప్పుడు ప్రభుత్వం మేలు చేస్తుంటే కోర్టుల పేరుతో అడ్డుకోవడం సరికాదన్నారు.0 Comments 0 Shares 477 Views 0 Reviews
-
ఖమ్మం: బోధన విస్మరించి.. వ్యాపారాల్లో నిమగ్నం!ఖమ్మం జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన గురువులు..తమ అసలు బాధ్యతను విస్మరించి సైడ్ బిజినెస్లలో మునిగితేలుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రెండో ఆదాయంపై మక్కువతో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇలాంటి వారిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.0 Comments 0 Shares 465 Views 0 Reviews
-
నేలకొండపల్లిలో ప్రమాదం.. ఆరుగురు యువకులకు గాయాలు...శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారును తప్పించబోయి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్లపై ప్రయాణిస్తున్న ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్లో బాధితులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.0 Comments 0 Shares 462 Views 0 Reviews
-
ఖమ్మం జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు..ఖమ్మం జిల్లాలో 10 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. 317జీవో ప్రకారం ఇంటర్ లోకల్ కేడర్లో భాగంగా వీరిని మంచిర్యాల, ఆదిలాబాద్, కరీంనగర్ వంటి ఇతర జిల్లాలకు కేటాయించారు. నేలకొండపల్లి, పెనుబల్లి, తిరుమలాయపాలెం తదితర మండలాలకు చెందిన కార్యదర్శులు ఈ బదిలీ అయిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరంతా తక్షణమే విధుల్లో చేరాల్సి ఉంటుంది.0 Comments 0 Shares 448 Views 0 Reviews
-
ఖమ్మం ఎంసీహెచ్ తగ్గుతున్న ప్రసవాలు...ఒకప్పుడు నెలకు వెయ్యికి పైగా డెలవరీలతో రికార్డు సృష్టించిన ఖమ్మం MCH ప్రస్తుతం వెలవెలబోతోంది. వైద్యుల సమయపాలన లోపం, పర్యవేక్షణ కరువవ్వడంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కలెక్టర్ సమీక్ష నిర్వహించి.. గైనకాలజీ విభాగం వైద్యులు సమయపాలన పాటిస్తూ, పర్యవేక్షణ పెంచాలని గట్టిగా ఆదేశించారు.0 Comments 0 Shares 452 Views 0 Reviews
-
వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం జిల్లా కలెక్టర్ వివరణఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లంచ్ మోషన్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించిందన్నారు. సుమారు రూ.250 కోట్ల విలువైన భూమిని రక్షించామని, అర్హులైన పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.0 Comments 0 Shares 464 Views 0 Reviews
-
అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్ను: కేటీఆర్ఖమ్మం: దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారని, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. 'ఖమ్మం జిల్లాలో ఇళ్ల కూల్చివేత పాపం ముగ్గురు మంత్రులదే. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్నేశారు. జిల్లా మంత్రులు మాయగాళ్లు.. చిచ్చుపెడుతున్నారు. పేదలకు ఇళ్లు కట్టించకపోగా ఇళ్లను కూల్చివేయడమేనా ఇందిరమ్మ రాజ్యం? మా ప్రభుత్వం వచ్చాక ఇదే స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తాం' అని...0 Comments 0 Shares 448 Views 0 Reviews
-
కనువిందుగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుక...భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణ వేడుకను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.0 Comments 0 Shares 467 Views 0 Reviews
-
మంగాపురం తండాలో నీటి సమస్యకు సర్పంచ్ పరిష్కారం...పాలేరు నియోజకవర్గ పరిధిలోని మంగాపురం తండా గ్రామపంచాయతీలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి సర్పంచ్ ధీరవతు అశోక రాణి కీలక అడుగు వేశారు. ఆదివారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నర్సరీలో ఆమె భూమి పూజ నిర్వహించి, బోరు వేయించారు. రానున్న వేసవి దృష్ట్యా గ్రామస్తులకు మంచినీటి ఎద్దడి లేకుండా చూడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు.0 Comments 0 Shares 473 Views 0 Reviews
-
పొంగులేటి సమక్షంలో ఏదులాపురం ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనిత...ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోని ఏదులాపురం మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో మున్సిపల్ ఛైర్పర్సన్ పోకబత్తిని అనిత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి సహకారంతో పాటు పాలకవర్గం, అధికారుల సమన్వయంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.0 Comments 0 Shares 447 Views 0 Reviews
-
అనంతనగర్ గురుకులంలో ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్షనేలకొండపల్లి మండలం అనంతనగర్ గురుకుల పాఠశాలలో ఆదివారం ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 480 మంది విద్యార్థులకు గాను 448 మంది (239 మంది బాలురు, 209 మంది బాలికలు) హాజరైనట్లు ప్రిన్సిపల్ శ్రీలత తెలిపారు. 32 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పరీక్ష సజావుగా సాగిందని వెల్లడించారు.0 Comments 0 Shares 476 Views 0 Reviews
-
ఖమ్మం టు కోదాడ హైవేపై కారు - బైక్ ఢీ...నేలకొండపల్లి: పైనంపల్లి - శాంతినగర్ మధ్య హైవేపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఓ వేగంగా వచ్చిన కారు బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భైరవనపల్లికి చెందిన వ్యక్తి, మహిళకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.0 Comments 0 Shares 515 Views 0 Reviews
-
సీఎం పదవికి పాలేరు ఎమ్మెల్యే తో ముప్పుంది: నారాయణకరెన్సీ ప్రభుత్వాలతో తమ గెలుపును ఆపలేరని CPI జాతీయ కమిషన్ ఛైర్మన్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఏదులాపురంలో ఆయన మాట్లాడుతూ.. తాము కరపత్రాలతో ప్రజల్లోకి వెళ్తుంటే.. కాంగ్రెస్, BRS నేతలు కరెన్సీ కట్టలతో రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇదే క్రమంలో రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ.. CM పదవికి ముప్పు పొంచి ఉంటే, అది పాలేరు ఎమ్మెల్యే గృహనిర్మాణశాక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రదర్శిస్తున్న...0 Comments 0 Shares 506 Views 0 Reviews
-
పాలేరులో మద్యం దందా.. బెల్ట్ షాపుల్లో ధరల మోతపాలేరు నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. వైన్స్లలో దొరకని బ్రాండ్లు బెల్ట్ షాపుల్లో నిల్వ ఉండటం గమనార్హం. నిర్వాహకులు సిండికేట్గా మారి కృత్రిమ కొరత సృష్టిస్తూ, గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యాన్ని తరలిస్తున్నారు. అక్కడ MRP కంటే రూ.30 నుంచి రూ.70 వరకు అదనంగా వసూలు చేస్తూ సామాన్యుల జేబులకు గండి కొడుతున్నారని, ఈ దోపిడీని అరికట్టాలని మందుబాబులు కోరుతున్నారు.0 Comments 0 Shares 272 Views 0 Reviews
-
పాలేరులో మద్యం దందా.. బెల్ట్ షాపుల్లో ధరల మోతపాలేరు నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. వైన్స్లలో దొరకని బ్రాండ్లు బెల్ట్ షాపుల్లో నిల్వ ఉండటం గమనార్హం. నిర్వాహకులు సిండికేట్గా మారి కృత్రిమ కొరత సృష్టిస్తూ, గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యాన్ని తరలిస్తున్నారు. అక్కడ MRP కంటే రూ.30 నుంచి రూ.70 వరకు అదనంగా వసూలు చేస్తూ సామాన్యుల జేబులకు గండి కొడుతున్నారని, ఈ దోపిడీని అరికట్టాలని మందుబాబులు కోరుతున్నారు.0 Comments 0 Shares 278 Views 0 Reviews
More Stories