కనువిందుగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుక...
భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణ వేడుకను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.
0 Comments 0 Shares 233 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com