Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • సివిల్ సర్వీసెస్ జిల్లా స్థాయి పోటీల్లో నాలుగు ఈవెంట్లకు ఎంపికైన నాగజ్యోతి

    అనకాపల్లి, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు సంబంధించి అనకాపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో పీవీఎం నాగజ్యోతి సత్తా చాటారు.

    జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నాగజ్యోతి ఏకంగా నాలుగు ఈవెంట్లలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

    ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ పోటీల్లో ఆమె నాలుగు విభాగాల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా స్థాయిలో విజయం సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపిక కావడంపై పలువురు ఆమెను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధించి జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
    78 Views
  • రోలుగుంటలో ప్రతి సోమవారం వినియోగదారులకు అందుబాటులో సహజ పంటలు
    అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం నిర్వహిస్తున్నారు. మండల కార్యాలయం ఆవరణలో వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు.ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిలో భాగంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను విక్రయిస్తున్నారు. వంకాయ, బెండ, పచ్చిమిర్చి, గోంగూర, గోరుచిక్కుడు, తోటకూర, అరటి వంటి పంటలను రైతులు నేరుగా తీసుకువచ్చి...
    226 Views
  • శ్రీ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
    • కలశ స్థాపనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు • రోజుకు 4000 మందికి పైగా భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు   ​నర్సీపట్నంలోని శ్రీ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11 ఆదివారం ఉదయం 8:55 నిమిషాలకు కలశ స్థాపనతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 21వ తేదీ బుధవారం వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో...
    115 Views
  • రోలుగుంట మండల జి హెచ్ ఆర్ ఏ ఏ చైర్మన్గా బెజవాడ సత్తిబాబు నియామకం
    అనకాపల్లి జిల్లా రోలుగుంట.  ప్రపంచ మానవ హక్కుల అవగాహనా సంఘం GHRAA వ్యవస్థాపకులు మరియు నేషనల్ చైర్మన్ కాసల కోనయ్య ఆదేశాల మేరకు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి సురేష్ కుమార్, రాష్ట్ర చైర్మన్ బి వి గణేష్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల చైర్మన్ గా బెజవాడ సత్తిబాబును నియమించడం జరిగింది.ఈ నియామకాన్ని అనకాపల్లి జిల్లా చైర్మన్ గొర్లీ రాఘవులు మరియు జిల్లా అడ్మిన్ గరికిన...
    259 Views
  • గూగుల్ మ్యాప్ లో కూడా లేని కొమ్మర్ల గ్రామం ఆదుకున్న రత్నంపేట జనసేన
    రోలుగుంట:ఈ గ్రామం ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు. మన నర్సీపట్నానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. గూగుల్ పటంలో కూడా కనిపించని ఆ గ్రామం పేరు కొమ్మర్ల.అనకాపల్లి జిల్లాకు అల్లూరి జిల్లాకు మధ్య కొండపై ఉన్న ఈ గ్రామంలో రోడ్డు లేదు, నీరు లేదు. అమాయక గిరిజన పిల్లలు సిమెంటు సంచులతో కట్టిన చిన్న గుడిసెలోనే చదువుకుంటున్నారు. నేల మీద కూర్చుని, చిరిగిన పలకలతో వారి...
    322 Views
  • కొవ్వూరు ఎనిమిదో వార్డులో సమస్యల పరిష్కారం పట్ల హర్షం
    అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామం ఎనిమిదో వార్డులో విద్యుత్ మరియు పారిశుధ్య సమస్యను త్వరితగతిన పరిష్కరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడం మరియు పారిశుధ్య కార్మికులు చెత్తను తీయకపోవడంపై వార్డు ప్రజలు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన పంచాయతీ కార్యదర్శి విద్యుత్ సమస్యను పునరుద్ధరించి, చెత్తను తొలగించేలా చర్యలు...
    271 Views
  • గాంధీ రోజు ప్రారంభమైన ఐసిడిసి సేవలు ఈరోజుకి కొనసాగుతున్నాయి.
    అనకాపల్లి జిల్లా రోలుగుంట  మాతృ మరణాలు, శిశు మరణాలను అరికట్టడం, బరువు తక్కువ పిల్లలు లేకుండా చేయడం అనే లక్ష్యంతో ఐసిడిఎస్ పథకాన్ని గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న మన రాష్ట్రంలో ప్రారంభించారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు సేవలు అందిస్తున్నారు. గర్భిణీలకు పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు, బాలింతలకు పౌష్టికాహారం, చిన్నారులకు...
    263 Views
  • కొవ్వూరులో ఘనంగా లాల్ బహుదూర్ శాస్త్రి గాంధీ జయంతి వేడుకలు
    అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీ సత్యం, అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్ముడు అని, లాల్ బహదూర్ శాస్త్రి దేశం కోసమే బ్రతికిన నిస్వార్థ నాయకుడని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో రైతు, సైనికులకు గుర్తింపు తెచ్చారని, ప్రధానిగా ఉండి కూడా సొంత కారు వాడని నిజాయితీపరుడని వక్తలు...
    244 Views
  • రోలుగుంట కస్తూరిబావి విద్యార్థుల క్రమశిక్షణ క్రాఫ్ట్ వర్క్ పై ప్రశంసించిన కలెక్టర్
     అక్టోబర్ - 01 అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఈరోజు గురువారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాఠశాల ఆవరణం మొత్తం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండటం చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు తయారు చేసిన డిస్ ప్లేలను మరియు క్రాఫ్ట్ వర్క్ లను చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. అంత చక్కగా నేర్పిస్తున్న వొకేషనల్ టీచర్...
    282 Views
  • రోలుగుంట జూనియర్ కళాశాల వీధి విద్యుత్ కష్టాలపై కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన యువకుడు
    అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో పేదల సేవలో 2.0 కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ ను రోలుగుంట గ్రామ ప్రభుత్వ జూనియర్ కళాశాల వీధిలో నెలకొన్న విద్యుత్ సమస్యపై స్థానిక యువకుడు రంగాల అనంతలక్ష్మి భాస్కర్ కలిసి వినతిపత్రం అందజేశాడు.రోలుగుంట గ్రామం జూనియర్ కళాశాల వీధిలో గత నాలుగేళ్లుగా విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లేకుండా పోయిందని, స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన కలెక్టర్ కు...
    313 Views
  • చెట్టుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
    అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో గురువారం ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.గ్రామంలోని అర్హులైన పెన్షన్ దారులకు కూటమి నాయకులు, సంబంధిత సిబ్బంది సమన్వయంతో పెన్షన్ నగదును అందజేశారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నామని కూటమి నాయకులు తెలిపారు. ఉదయం...
    234 Views
  • ఏపీలోని 6 జిల్లాలకు వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.
    ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.   విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. ప్రధానంగా ఆరు జిల్లాల్లో వర్ష ప్రభావం ఉండనుంది....
    137 Views
More Results