• అసెంబ్లీ భవన మరమ్మతుల పరిశీలన


    హైదరాబాద్ :చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాంగణమంతా తిరిగి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు.


    శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
    అసెంబ్లీ భవన మరమ్మతుల పరిశీలన హైదరాబాద్ :చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాంగణమంతా తిరిగి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
    0 Comments 0 Shares 36 Views 0 Reviews
  • రేపు తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు


    హైదరాబాద్: తెలంగాణలో రేపు విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులపై న్యాయపరమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.


    అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, **నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)**ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. అదేవిధంగా వీబీఎస్‌ఏ (VBSA) బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.


    బంద్‌కు పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిస్థితిపై ఆసక్తి నెలకొంది. అధికార యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడుతోంది.
    రేపు తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు హైదరాబాద్: తెలంగాణలో రేపు విద్యాసంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులపై న్యాయపరమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, **నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)**ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. అదేవిధంగా వీబీఎస్‌ఏ (VBSA) బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బంద్‌కు పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిస్థితిపై ఆసక్తి నెలకొంది. అధికార యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడుతోంది.
    0 Comments 0 Shares 32 Views 0 Reviews
  • కల్తీల నియంత్రణకు కఠిన చట్టం.. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు: సీఎం రేవంత్


    హైదరాబాద్ :
    ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో శనివారం తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.


    కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రసాయనాల వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీల నివారణలో సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాల విధానాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లు సిద్ధం చేసి శాసనసభలో సమగ్ర చర్చ అనంతరం చట్టం తీసుకురావాలని సూచించారు.


    కల్తీలపై సమాచారం సేకరణకు విజిల్‌బ్లోయర్లను నియమించడంతో పాటు ప్రజల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే క్యూర్ (CURE) ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిబంధనలను తొలుత అక్కడ అమలు చేసి, అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు.


    సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ప్రధాన కార్యదర్శులు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    కల్తీల నియంత్రణకు కఠిన చట్టం.. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు: సీఎం రేవంత్ హైదరాబాద్ : ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో శనివారం తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రసాయనాల వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీల నివారణలో సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాల విధానాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లు సిద్ధం చేసి శాసనసభలో సమగ్ర చర్చ అనంతరం చట్టం తీసుకురావాలని సూచించారు. కల్తీలపై సమాచారం సేకరణకు విజిల్‌బ్లోయర్లను నియమించడంతో పాటు ప్రజల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే క్యూర్ (CURE) ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిబంధనలను తొలుత అక్కడ అమలు చేసి, అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ప్రధాన కార్యదర్శులు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 83 Views 0 Reviews
  • మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి రూ.13 కోట్లు
    హుజూర్నగర్ రూరల్/ భారత్ అవాజ్ :
    తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లను మంజూరు చేసింది.
    ఈ నిధులతో ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
    అభివృద్ధి పనులు:
    ఆధునిక పర్యాటక సౌకర్యాల ఏర్పాటు
    భక్తులకు వసతి, తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలు
    బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి
    సందర్శకుల కోసం ఇతర సౌకర్యాల కల్పన
    మంజూరు చేసిన నిధులతో:
    ఆలయ పరిసరాల అభివృద్ధి
    భక్తుల కోసం మెరుగైన వసతులు
    పర్యాటకులను ఆకర్షించే మౌలిక సదుపాయాల ఏర్పాటు
    ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మట్టపల్లి క్షేత్రం తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం పేర్కొంది
    మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి రూ.13 కోట్లు హుజూర్నగర్ రూరల్/ భారత్ అవాజ్ : తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అభివృద్ధి పనులు: ఆధునిక పర్యాటక సౌకర్యాల ఏర్పాటు భక్తులకు వసతి, తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలు బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి సందర్శకుల కోసం ఇతర సౌకర్యాల కల్పన మంజూరు చేసిన నిధులతో: ఆలయ పరిసరాల అభివృద్ధి భక్తుల కోసం మెరుగైన వసతులు పర్యాటకులను ఆకర్షించే మౌలిక సదుపాయాల ఏర్పాటు ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మట్టపల్లి క్షేత్రం తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం పేర్కొంది
    Like
    1
    0 Comments 0 Shares 145 Views 0 Reviews
  • బిగ్ బ్రేకింగ్: సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉన్నట్లు ఆరోపణ


    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు అచ్చంపేట (నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి), కొడంగల్ (మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధి) నియోజకవర్గాల్లో ఒకే EPIC నంబర్ (TES0274035)తో ఓటరుగా నమోదై ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.


    ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటంపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇటీవల బహుళ ప్రాంతాల్లో ఓటరు నమోదుకు సంబంధించిన అంశాలు కూడా వివాదాస్పదంగా మారాయి.


    అయితే, ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం లేదా సంబంధిత అధికారుల నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
    బిగ్ బ్రేకింగ్: సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉన్నట్లు ఆరోపణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు అచ్చంపేట (నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి), కొడంగల్ (మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధి) నియోజకవర్గాల్లో ఒకే EPIC నంబర్ (TES0274035)తో ఓటరుగా నమోదై ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటంపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇటీవల బహుళ ప్రాంతాల్లో ఓటరు నమోదుకు సంబంధించిన అంశాలు కూడా వివాదాస్పదంగా మారాయి. అయితే, ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం లేదా సంబంధిత అధికారుల నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
    0 Comments 0 Shares 168 Views 0 Reviews
  • హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్




    *ఓ బస్సులో గుట్టుగా గంజాయి స్మగ్లింగ్




    *ఒడిస్సా నుండి రాష్ట్రానికి గంజాయి రవాణా




    *ఆ ముఠా గుట్టు ను రట్టు చేసిన అధికారులు


    తెలంగాణ బ్యూరో ప్రతినిధి ,హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ అధికారులు ఆదివారం నాడు మెగా ఆపరేషన్ నిర్వహించారు. ఓ బస్సులో గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సునే డ్రగ్స్ రవాణాకు స్మగ్లర్లు వినియోగించారు. డ్రైవర్, కండక్టర్, హెల్పర్ కుమ్మక్కై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒడిశాలో గంజాయి లోడ్ చేసి హైదరాబాద్‌కు బస్సు సిబ్బంది తీసుకువచ్చారు. కమీషన్ కోసం డ్రగ్స్ రవాణాకు డ్రైవర్, కండక్టర్, హెల్పర్ ఒప్పుకున్నట్లు ఈగల్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు 41 కిలోల గంజాయి రవాణా చేసినట్లు ఈగల్ అధికారులు తెలిపారు. డెలివరీకి ముందే అధికారులు మెరుపు దాడి చేశారు. డ్రైవర్, కండక్టర్,హెల్పర్ కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి రూ.20.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా చేసిన బాబా భోలానాథ్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రిసీవర్‌తో పాటు మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్‌ను డ్రగ్స్ మాఫియా అడ్డాగా పలు ముఠాలు మారుస్తున్నట్లు ఈగల్ అధికారులు పేర్కొన్నారు.
    హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్ *ఓ బస్సులో గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ *ఒడిస్సా నుండి రాష్ట్రానికి గంజాయి రవాణా *ఆ ముఠా గుట్టు ను రట్టు చేసిన అధికారులు తెలంగాణ బ్యూరో ప్రతినిధి ,హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ అధికారులు ఆదివారం నాడు మెగా ఆపరేషన్ నిర్వహించారు. ఓ బస్సులో గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సునే డ్రగ్స్ రవాణాకు స్మగ్లర్లు వినియోగించారు. డ్రైవర్, కండక్టర్, హెల్పర్ కుమ్మక్కై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒడిశాలో గంజాయి లోడ్ చేసి హైదరాబాద్‌కు బస్సు సిబ్బంది తీసుకువచ్చారు. కమీషన్ కోసం డ్రగ్స్ రవాణాకు డ్రైవర్, కండక్టర్, హెల్పర్ ఒప్పుకున్నట్లు ఈగల్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు 41 కిలోల గంజాయి రవాణా చేసినట్లు ఈగల్ అధికారులు తెలిపారు. డెలివరీకి ముందే అధికారులు మెరుపు దాడి చేశారు. డ్రైవర్, కండక్టర్,హెల్పర్ కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి రూ.20.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా చేసిన బాబా భోలానాథ్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రిసీవర్‌తో పాటు మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్‌ను డ్రగ్స్ మాఫియా అడ్డాగా పలు ముఠాలు మారుస్తున్నట్లు ఈగల్ అధికారులు పేర్కొన్నారు.
    0 Comments 0 Shares 170 Views 0 Reviews
  • తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ హైదరాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షులు శ్రీ ఎస్. విక్రమ్ కుమార్ మరియు కార్యదర్శి శ్రీ కురాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు జిల్లా సంఘం ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, శాఖల యూనియన్ నాయకులు కలిసి టీఎన్‌జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. ఎమ్. హుస్సేని (ముజీబ్) గార్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.


    ప్రస్తుతం జరుగుతున్న బదిలీలలో హైదరాబాద్ జిల్లాలోని టీఎన్‌జీఓస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎక్కడికక్కడ తమ ప్రస్తుత పని ప్రదేశాలలోనే కొనసాగేలా కేంద్ర సంఘం చేసిన అసాధారణ కృషికి గాను ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.


    ఈ సమావేశంలో టీఎన్‌జీఓ కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీమతి ఉమ (కోశాధికారి), శ్రీ కొండల్ రెడ్డి (ఉపాధ్యక్షులు), శ్రీ నరసింహారెడ్డి (ఉపాధ్యక్షులు), మరియు శ్రీమతి శైలజ (సంయుక్త కార్యదర్శి) గార్లు కూడా పాల్గొన్నారు.


    అలాగే జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఆర్. రాజ్ కుమార్, ఈసీ مెంబర్ శ్రీ ముఖీమ్ ఖురేషి గార్లతో పాటు ఖైరతాబాద్, అమీర్‌పేట్, కింగ్ కోఠి, జగమ్మేట్, నాంపల్లి, గోల్కొండ ఆసుపత్రుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, వర్క్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, పెన్షన్ పేమెంట్, ట్రెజరీస్ డిపార్ట్‌మెంట్, నిలోఫర్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు మరియు ఈసీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


    కృతజ్ఞతలు తెలిపిన అనంతరం, హైదరాబాద్ జిల్లా పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ, కార్మిక ఉపాధి మరియు శిక్షణ శాఖలలో నిబంధనలకు విరుద్ధంగా, మానవతా దృక్పథం లేకుండా జిల్లా దాటించి బదిలీ చేసిన పలువురు ఉద్యోగుల సమస్యలను విక్రమ్ కుమార్ గారు కేంద్ర సంఘం నేతలకు వివరించారు.
    ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో (పోస్ట్-న్యూరోసర్జరీ, ఫిట్స్) బాధపడుతున్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు సెక్టార్ పరిధి దాటకుండా చూడాలని, అలాగే భర్త హైదరాబాద్‌లో పనిచేస్తూ భార్యను అన్యాయంగా సంగారెడ్డికి బదిలీ చేసిన ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 లాంటి వారిని తిరిగి డెప్యుటేషన్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేయాలని కేంద్ర సంఘం నాయకత్వాన్ని కోరారు.
    దీనిపై టీఎన్‌జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు సానుకూలంగా స్పందిస్తూ.. ఈ సమస్యలను వెంటనే సదరు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి, ఉద్యోగులందరికీ త్వరలోనే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
    తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ హైదరాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షులు శ్రీ ఎస్. విక్రమ్ కుమార్ మరియు కార్యదర్శి శ్రీ కురాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు జిల్లా సంఘం ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, శాఖల యూనియన్ నాయకులు కలిసి టీఎన్‌జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. ఎమ్. హుస్సేని (ముజీబ్) గార్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలలో హైదరాబాద్ జిల్లాలోని టీఎన్‌జీఓస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎక్కడికక్కడ తమ ప్రస్తుత పని ప్రదేశాలలోనే కొనసాగేలా కేంద్ర సంఘం చేసిన అసాధారణ కృషికి గాను ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో టీఎన్‌జీఓ కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీమతి ఉమ (కోశాధికారి), శ్రీ కొండల్ రెడ్డి (ఉపాధ్యక్షులు), శ్రీ నరసింహారెడ్డి (ఉపాధ్యక్షులు), మరియు శ్రీమతి శైలజ (సంయుక్త కార్యదర్శి) గార్లు కూడా పాల్గొన్నారు. అలాగే జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఆర్. రాజ్ కుమార్, ఈసీ مెంబర్ శ్రీ ముఖీమ్ ఖురేషి గార్లతో పాటు ఖైరతాబాద్, అమీర్‌పేట్, కింగ్ కోఠి, జగమ్మేట్, నాంపల్లి, గోల్కొండ ఆసుపత్రుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, వర్క్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, పెన్షన్ పేమెంట్, ట్రెజరీస్ డిపార్ట్‌మెంట్, నిలోఫర్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు మరియు ఈసీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలిపిన అనంతరం, హైదరాబాద్ జిల్లా పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ, కార్మిక ఉపాధి మరియు శిక్షణ శాఖలలో నిబంధనలకు విరుద్ధంగా, మానవతా దృక్పథం లేకుండా జిల్లా దాటించి బదిలీ చేసిన పలువురు ఉద్యోగుల సమస్యలను విక్రమ్ కుమార్ గారు కేంద్ర సంఘం నేతలకు వివరించారు. ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో (పోస్ట్-న్యూరోసర్జరీ, ఫిట్స్) బాధపడుతున్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు సెక్టార్ పరిధి దాటకుండా చూడాలని, అలాగే భర్త హైదరాబాద్‌లో పనిచేస్తూ భార్యను అన్యాయంగా సంగారెడ్డికి బదిలీ చేసిన ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 లాంటి వారిని తిరిగి డెప్యుటేషన్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేయాలని కేంద్ర సంఘం నాయకత్వాన్ని కోరారు. దీనిపై టీఎన్‌జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు సానుకూలంగా స్పందిస్తూ.. ఈ సమస్యలను వెంటనే సదరు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి, ఉద్యోగులందరికీ త్వరలోనే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
    0 Comments 0 Shares 325 Views 0 Reviews
  • తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హైదరాబాద్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ కార్యాలయ ప్రాంగణంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో ఉద్యోగ బంధువులు, కేంద్ర మరియు జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


    ఉదయం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ:
    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం హైదరాబాద్ జిల్లా యూనియన్ ప్రాంగణంలో శ్రీ విక్రమ్ కుమార్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాలు, ఉద్యోగుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, ఆ నాడు ఉద్యమకారుల చూపిన బాటలోనే నేడు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.


    సాయంత్రం ప్రధాన ఉత్సవాలు - కేక్ కట్టింగ్:
    సాయంత్రం జరిగిన ఉత్సవాలకు టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు ఒక ప్రత్యేక కేక్‌ను సిద్ధం చేయగా, ముఖ్య అతిథి మరియు ఇతర నేతల సమక్షంలో ఆ కేక్‌ను కట్ చేసి అందరికీ తీపి తినిపించారు.


    కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ ప్రసంగం:
    ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ మారం జగదీశ్వర్ గారు మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో ఉద్యోగుల పోరాట పటిమను, అలుపెరగని దీక్షను గుర్తుచేసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం నూతనంగా ప్రతిపాదించిన ఆరోగ్య పథకం (EHS) అమల్లోకి వచ్చేలా కేంద్ర సంఘం చేసిన అగణిత కృషిని, పడిన శ్రమను ఆయన ఉద్యోగులకు వివరించారు. ఎటువంటి ప్రీమియం భారం లేకుండా స్వతంత్ర ట్రస్ట్ ఆధారిత ఈహెచ్ఎస్ రావడం ఉద్యోగుల విజయమని పేర్కొన్నారు.


    ఇదే వేదికగా ఆయన ఒక కీలకమైన పిలుపునిచ్చారు. కొందరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా ఈహెచ్ఎస్ (EHS) పథకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారి మాటలను నమ్మవద్దని మరియు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని ఉద్యోగులను కోరారు. పథకం మరింత పటిష్టంగా మారేందుకు ప్రభుత్వానికి అవసరమైన సవరణలను సూచిస్తున్నామే తప్ప, పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాలను ఎవరూ ప్రోత్సహించవద్దని ఆయన హెచ్చరించారు.


    ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకున్న డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్):
    తదనంతరం డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓల పాత్రను, నాడు సకల జనుల సమ్మె కాలంలో అనుభవించిన క్లిష్ట పరిస్థితులను భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఆనాటి పోరాట స్ఫూర్తిని నిరంతరం కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు.


    పాల్గొన్న ప్రముఖులు:
    ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం ట్రెజరర్ శ్రీమతి ఉమ, క్లాస్-IV కేంద్ర అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ ఖాదర్ బిన్ హసన్, నాగర్ కర్నూల్ అధ్యక్షులు శ్రీ బి. వెంకటేష్, నల్గొండ అధ్యక్షులు శ్రీ ఎన్. మురళి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీ కూరాడి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కార్యదర్శి శ్రీ శేఖర్ రెడ్డి, మరియు నాయకులు శ్రీ పి. వరద రాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఆర్. రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు.


    వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ ఖాలెద్ అహ్మద్, శ్రీ బి. శంకర్, శ్రీమతి జి. గీత, శ్రీ వైదిక్ శ్రేష్ట, శ్రీ ముఖీం ఖురేషి, శ్రీ ఎ.వి. శ్రీధర్, మరియు కేంద్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కొండల్ రెడ్డి, శ్రీ గోవర్ధన్ రెడ్డి, శ్రీమతి అనురాధ, శ్రీమతి వరలక్ష్మి లతో పాటు వివిధ యూనిట్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మరియు పెద్ద సంఖ్యలో ప్రాథమిక సభ్యులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హైదరాబాద్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ కార్యాలయ ప్రాంగణంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో ఉద్యోగ బంధువులు, కేంద్ర మరియు జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం హైదరాబాద్ జిల్లా యూనియన్ ప్రాంగణంలో శ్రీ విక్రమ్ కుమార్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాలు, ఉద్యోగుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, ఆ నాడు ఉద్యమకారుల చూపిన బాటలోనే నేడు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సాయంత్రం ప్రధాన ఉత్సవాలు - కేక్ కట్టింగ్: సాయంత్రం జరిగిన ఉత్సవాలకు టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు ఒక ప్రత్యేక కేక్‌ను సిద్ధం చేయగా, ముఖ్య అతిథి మరియు ఇతర నేతల సమక్షంలో ఆ కేక్‌ను కట్ చేసి అందరికీ తీపి తినిపించారు. కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ ప్రసంగం: ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ మారం జగదీశ్వర్ గారు మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో ఉద్యోగుల పోరాట పటిమను, అలుపెరగని దీక్షను గుర్తుచేసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం నూతనంగా ప్రతిపాదించిన ఆరోగ్య పథకం (EHS) అమల్లోకి వచ్చేలా కేంద్ర సంఘం చేసిన అగణిత కృషిని, పడిన శ్రమను ఆయన ఉద్యోగులకు వివరించారు. ఎటువంటి ప్రీమియం భారం లేకుండా స్వతంత్ర ట్రస్ట్ ఆధారిత ఈహెచ్ఎస్ రావడం ఉద్యోగుల విజయమని పేర్కొన్నారు. ఇదే వేదికగా ఆయన ఒక కీలకమైన పిలుపునిచ్చారు. కొందరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా ఈహెచ్ఎస్ (EHS) పథకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారి మాటలను నమ్మవద్దని మరియు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని ఉద్యోగులను కోరారు. పథకం మరింత పటిష్టంగా మారేందుకు ప్రభుత్వానికి అవసరమైన సవరణలను సూచిస్తున్నామే తప్ప, పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాలను ఎవరూ ప్రోత్సహించవద్దని ఆయన హెచ్చరించారు. ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకున్న డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్): తదనంతరం డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) గారు మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓల పాత్రను, నాడు సకల జనుల సమ్మె కాలంలో అనుభవించిన క్లిష్ట పరిస్థితులను భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఆనాటి పోరాట స్ఫూర్తిని నిరంతరం కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం ట్రెజరర్ శ్రీమతి ఉమ, క్లాస్-IV కేంద్ర అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ ఖాదర్ బిన్ హసన్, నాగర్ కర్నూల్ అధ్యక్షులు శ్రీ బి. వెంకటేష్, నల్గొండ అధ్యక్షులు శ్రీ ఎన్. మురళి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీ కూరాడి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కార్యదర్శి శ్రీ శేఖర్ రెడ్డి, మరియు నాయకులు శ్రీ పి. వరద రాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఆర్. రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ ఖాలెద్ అహ్మద్, శ్రీ బి. శంకర్, శ్రీమతి జి. గీత, శ్రీ వైదిక్ శ్రేష్ట, శ్రీ ముఖీం ఖురేషి, శ్రీ ఎ.వి. శ్రీధర్, మరియు కేంద్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కొండల్ రెడ్డి, శ్రీ గోవర్ధన్ రెడ్డి, శ్రీమతి అనురాధ, శ్రీమతి వరలక్ష్మి లతో పాటు వివిధ యూనిట్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మరియు పెద్ద సంఖ్యలో ప్రాథమిక సభ్యులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
    0 Comments 0 Shares 464 Views 0 Reviews
  • *వడదెబ్బతో చనిపోతే రూ. 4 లక్షల పరిహారం - ప్రభుత్వ నిబంధనలు*


    తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను "ప్రకృతి విపత్తు" గా గుర్తించింది. అందుకే వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి *రూ. 4,00,000 పరిహారం* ఇస్తుంది. గతంలో ఇది కేవలం ₹50,000 మాత్రమే. a4bd


    *పరిహారం రావాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్*


    *1. వెంటనే సమాచారం ఇవ్వాలి - 24 గంటల్లో*
    - *పోలీస్ స్టేషన్*: మీ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వడదెబ్బతోనే చనిపోయారని FIR లో రాయించాలి.
    - *రెవెన్యూ శాఖ*: MRO/VRO కి సమాచారం ఇవ్వండి.
    - *వైద్య శాఖ*: స్థానిక ANM, ఆశా వర్కర్ లేదా PHC డాక్టర్‌కు చెప్పాలి.


    *2. పోస్టుమార్టం తప్పనిసరి*
    వడదెబ్బ వల్లే మరణం సంభవించిందని నిర్ధారించడానికి *ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం* చేయించాలి. ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్ట్ చెల్లదు. పోస్టుమార్టం రిపోర్టులో "Cause of death: Heat Stroke/Sunstroke" అని స్పష్టంగా ఉండాలి. a0e3


    *3. కావాల్సిన డాక్యుమెంట్లు*
    1. మరణ ధృవీకరణ పత్రం - గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి
    2. పోస్టుమార్టం రిపోర్ట్ - ప్రభుత్వ ఆసుపత్రి నుంచి
    3. పోలీస్ FIR కాపీ
    4. మృతుని ఆధార్ కార్డ్, ఓటర్ ID జిరాక్స్
    5. కుటుంబ సభ్యుల ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ - వారసత్వ ధృవీకరణ కోసం
    6. MRO ఇచ్చే "వడదెబ్బ మరణ ధృవీకరణ" నివేదిక
    7. వైద్యాధికారి ఇచ్చే రిపోర్ట్


    *4. దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి?*
    అన్ని డాక్యుమెంట్లతో *MRO/తహసీల్దార్ ఆఫీస్‌లో* దరఖాస్తు పెట్టాలి. MRO విచారణ చేసి, కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదంతో *SDRF నిధుల నుంచి* 4 లక్షలు వారసుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు.


    *ముఖ్యమైన నిబంధనలు - జాగ్రత్తలు*
    నిబంధన వివరణ
    **వయసు** వయసుతో సంబంధం లేదు. పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది.
    **టైమ్ లిమిట్** మరణించిన 30 రోజుల్లో దరఖాస్తు పెట్టడం మంచిది. ఆలస్యమైతే కారణం చెప్పాలి.
    **ఎక్కడ చనిపోయారు** ఇంట్లో, పొలంలో, రోడ్డు మీద ఎక్కడైనా సరే. కానీ వడదెబ్బ వల్లే అని ప్రూవ్ కావాలి.
    **మందు/మత్తు** మద్యం తాగి, వడదెబ్బ తగిలి చనిపోతే పరిహారం రాదు. పోస్టుమార్టంలో తేలుతుంది.
    **ఇతర అనారోగ్యం** గుండె జబ్బు, షుగర్ ఉండి వడదెబ్బతో చనిపోతే, డాక్టర్ "Primary cause Heat Stroke" అని రాస్తేనే వస్తుంది.
    *పరిహారం రాకపోవడానికి కారణాలు*
    1. పోస్టుమార్టం చేయించకపోవడం
    2. FIR లో "వడదెబ్బ" అని రాయించకపోవడం
    3. ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయి, వడదెబ్బ అని ప్రూవ్ చేయలేకపోవడం
    4. మద్యం సేవించి ఉన్నట్టు రిపోర్ట్‌లో రావడం


    *మీరు వెంటనే చేయాల్సింది*: మీ దగ్గర ఎవరైనా వడదెబ్బతో చనిపోతే, ముందు 100 కి డయల్ చేసి పోలీసులకు, 108 కి కాల్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించండి. పోస్టుమార్టం చేయించండి. తర్వాత MRO ని కలవండి.
    *వడదెబ్బతో చనిపోతే రూ. 4 లక్షల పరిహారం - ప్రభుత్వ నిబంధనలు* తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను "ప్రకృతి విపత్తు" గా గుర్తించింది. అందుకే వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి *రూ. 4,00,000 పరిహారం* ఇస్తుంది. గతంలో ఇది కేవలం ₹50,000 మాత్రమే. a4bd *పరిహారం రావాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్* *1. వెంటనే సమాచారం ఇవ్వాలి - 24 గంటల్లో* - *పోలీస్ స్టేషన్*: మీ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వడదెబ్బతోనే చనిపోయారని FIR లో రాయించాలి. - *రెవెన్యూ శాఖ*: MRO/VRO కి సమాచారం ఇవ్వండి. - *వైద్య శాఖ*: స్థానిక ANM, ఆశా వర్కర్ లేదా PHC డాక్టర్‌కు చెప్పాలి. *2. పోస్టుమార్టం తప్పనిసరి* వడదెబ్బ వల్లే మరణం సంభవించిందని నిర్ధారించడానికి *ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం* చేయించాలి. ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్ట్ చెల్లదు. పోస్టుమార్టం రిపోర్టులో "Cause of death: Heat Stroke/Sunstroke" అని స్పష్టంగా ఉండాలి. a0e3 *3. కావాల్సిన డాక్యుమెంట్లు* 1. మరణ ధృవీకరణ పత్రం - గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి 2. పోస్టుమార్టం రిపోర్ట్ - ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 3. పోలీస్ FIR కాపీ 4. మృతుని ఆధార్ కార్డ్, ఓటర్ ID జిరాక్స్ 5. కుటుంబ సభ్యుల ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ - వారసత్వ ధృవీకరణ కోసం 6. MRO ఇచ్చే "వడదెబ్బ మరణ ధృవీకరణ" నివేదిక 7. వైద్యాధికారి ఇచ్చే రిపోర్ట్ *4. దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి?* అన్ని డాక్యుమెంట్లతో *MRO/తహసీల్దార్ ఆఫీస్‌లో* దరఖాస్తు పెట్టాలి. MRO విచారణ చేసి, కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదంతో *SDRF నిధుల నుంచి* 4 లక్షలు వారసుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు. *ముఖ్యమైన నిబంధనలు - జాగ్రత్తలు* నిబంధన వివరణ **వయసు** వయసుతో సంబంధం లేదు. పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది. **టైమ్ లిమిట్** మరణించిన 30 రోజుల్లో దరఖాస్తు పెట్టడం మంచిది. ఆలస్యమైతే కారణం చెప్పాలి. **ఎక్కడ చనిపోయారు** ఇంట్లో, పొలంలో, రోడ్డు మీద ఎక్కడైనా సరే. కానీ వడదెబ్బ వల్లే అని ప్రూవ్ కావాలి. **మందు/మత్తు** మద్యం తాగి, వడదెబ్బ తగిలి చనిపోతే పరిహారం రాదు. పోస్టుమార్టంలో తేలుతుంది. **ఇతర అనారోగ్యం** గుండె జబ్బు, షుగర్ ఉండి వడదెబ్బతో చనిపోతే, డాక్టర్ "Primary cause Heat Stroke" అని రాస్తేనే వస్తుంది. *పరిహారం రాకపోవడానికి కారణాలు* 1. పోస్టుమార్టం చేయించకపోవడం 2. FIR లో "వడదెబ్బ" అని రాయించకపోవడం 3. ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయి, వడదెబ్బ అని ప్రూవ్ చేయలేకపోవడం 4. మద్యం సేవించి ఉన్నట్టు రిపోర్ట్‌లో రావడం *మీరు వెంటనే చేయాల్సింది*: మీ దగ్గర ఎవరైనా వడదెబ్బతో చనిపోతే, ముందు 100 కి డయల్ చేసి పోలీసులకు, 108 కి కాల్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించండి. పోస్టుమార్టం చేయించండి. తర్వాత MRO ని కలవండి.
    0 Comments 0 Shares 695 Views 0 Reviews
  • మొయినాబాద్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 20 మంది BRS, BJP, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ జాగృతి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్, తెలంగాణ రక్షణ సేన బేగరి రాజు ఆధ్వర్యంలో అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్ నూర్ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఉచిత విద్య, వైద్యం అందించడమే పార్టీ ఆశయమని నాయకులు తెలిపారు
    మొయినాబాద్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 20 మంది BRS, BJP, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ జాగృతి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్, తెలంగాణ రక్షణ సేన బేగరి రాజు ఆధ్వర్యంలో అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్ నూర్ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఉచిత విద్య, వైద్యం అందించడమే పార్టీ ఆశయమని నాయకులు తెలిపారు
    0 Comments 1 Shares 701 Views 0 Reviews
  • [13/05, 2:09 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
    [13/05, 2:17 pm] null: ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
    [13/05, 2:09 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. [13/05, 2:17 pm] null: ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
    0 Comments 0 Shares 375 Views 0 Reviews
  • తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేయర్స్ కాన్‌క్లేవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
    తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేయర్స్ కాన్‌క్లేవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
    0 Comments 0 Shares 334 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com