• అల్వాల్ సర్కిల్‌లో ఫాదర్ బాలయ్య నగర్ సమస్యలు – 10 నెలలుగా ప్రజల ఇబ్బందులు

    అల్వాల్ సర్కిల్ 133 డివిజన్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ ప్రజలు దాదాపు పది నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల దుస్థితి, తాగునీటి పైపుల పనులు ఆగిపోవడం, డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో ముంపు కారణంగా కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

    విద్యార్థులు మాట్లాడుతూ – “గ్రామాల్లో కూడా ఇలాంటి దుస్థితి చూడలేదు. ప్రతిరోజూ బురదలో నడవడం శిక్షలా మారింది. GHMC వెంటనే చర్యలు తీసుకోవాలి” అన్నారు.

    కాలనీవాసులు వాపోతూ – “పది నెలల క్రితం తవ్విన రోడ్లు అలాగే వదిలేశారు. వర్షం పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి, మేమే మోటర్లతో నీటిని తీసేయాలి. మా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ప్రజల డిమాండ్ స్పష్టంగా ఉంది –

    GHMC వెంటనే రోడ్ల ఫై ఉన్న బురదను తీసివేయాలి

    కాలనీవాసులు హెచ్చరిస్తూ – “మా సమస్యలు ఇక పక్కన పెట్టకండి, GHMC తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్లక్ష్యం ఇక భరించలేము” అని అన్నారు.

    -sidhumaroju
    అల్వాల్ సర్కిల్‌లో ఫాదర్ బాలయ్య నగర్ సమస్యలు – 10 నెలలుగా ప్రజల ఇబ్బందులు అల్వాల్ సర్కిల్ 133 డివిజన్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ ప్రజలు దాదాపు పది నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల దుస్థితి, తాగునీటి పైపుల పనులు ఆగిపోవడం, డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో ముంపు కారణంగా కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ – “గ్రామాల్లో కూడా ఇలాంటి దుస్థితి చూడలేదు. ప్రతిరోజూ బురదలో నడవడం శిక్షలా మారింది. GHMC వెంటనే చర్యలు తీసుకోవాలి” అన్నారు. కాలనీవాసులు వాపోతూ – “పది నెలల క్రితం తవ్విన రోడ్లు అలాగే వదిలేశారు. వర్షం పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి, మేమే మోటర్లతో నీటిని తీసేయాలి. మా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డిమాండ్ స్పష్టంగా ఉంది – GHMC వెంటనే రోడ్ల ఫై ఉన్న బురదను తీసివేయాలి కాలనీవాసులు హెచ్చరిస్తూ – “మా సమస్యలు ఇక పక్కన పెట్టకండి, GHMC తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్లక్ష్యం ఇక భరించలేము” అని అన్నారు. -sidhumaroju
    1 Comments 0 Shares 254 Views 15 0 Reviews
  • సికింద్రాబాద్: తిరుమలగిరి> శుభకార్యం కోసం వేసిన పందిరిని తొలగిస్తున్న క్రమంలో విద్యుతఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలగిరి పిఎస్ పరిధిలోని సరస్వతి నగర్ లో చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి మృతి చెందగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విద్యుతఘాదానికి గురైన వీడియోలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి.రిసాలా బజారుకు చెందిన విజయ్ విష్ణు లక్కీ అనే ముగ్గురు వ్యక్తులు దీపక్ అనే వ్యక్తి వద్ద జీవనోపాధి కోసం టెంట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సరస్వతి నగర్ లో శుభకార్యం నిమిత్తం వేసిన టెంట్ తీస్తున్న క్రమంలో విద్యుతఘాతంతో విజయ్ అనే వ్యక్తి మృతి చెందగా..లక్కీ,విష్ణులకు గాయాలు అయ్యాయి. టెంట్ హౌస్ యజమాని దీపక్ ఆదేశాల మేరకు నిచ్చెన వేసుకుని టెంట్ తొలగిస్తున్న క్రమంలో టెంట్ హౌస్ ఇనుప రాడ్ కు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుతఘాతం జరిగింది. నిచ్చెన పైన ఉన్న విజయ్ కి తీవ్రగాయాలు కాగా నిచ్చెన పట్టుకొని ఉన్న విష్ణు,లక్కీలకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విజయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    - sidhumaroju
    సికింద్రాబాద్: తిరుమలగిరి> శుభకార్యం కోసం వేసిన పందిరిని తొలగిస్తున్న క్రమంలో విద్యుతఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలగిరి పిఎస్ పరిధిలోని సరస్వతి నగర్ లో చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి మృతి చెందగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విద్యుతఘాదానికి గురైన వీడియోలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి.రిసాలా బజారుకు చెందిన విజయ్ విష్ణు లక్కీ అనే ముగ్గురు వ్యక్తులు దీపక్ అనే వ్యక్తి వద్ద జీవనోపాధి కోసం టెంట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సరస్వతి నగర్ లో శుభకార్యం నిమిత్తం వేసిన టెంట్ తీస్తున్న క్రమంలో విద్యుతఘాతంతో విజయ్ అనే వ్యక్తి మృతి చెందగా..లక్కీ,విష్ణులకు గాయాలు అయ్యాయి. టెంట్ హౌస్ యజమాని దీపక్ ఆదేశాల మేరకు నిచ్చెన వేసుకుని టెంట్ తొలగిస్తున్న క్రమంలో టెంట్ హౌస్ ఇనుప రాడ్ కు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుతఘాతం జరిగింది. నిచ్చెన పైన ఉన్న విజయ్ కి తీవ్రగాయాలు కాగా నిచ్చెన పట్టుకొని ఉన్న విష్ణు,లక్కీలకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విజయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. - sidhumaroju
    0 Comments 0 Shares 284 Views 13 0 Reviews
  • స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అవుతున్నా… ఇంకా మన దేశాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య ఏది?
    స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అవుతున్నా… ఇంకా మన దేశాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య ఏది?
    0
    0
    0
    0
    0 Comments 0 Shares 264 Views 0 Reviews
  • 79 వ స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు
    రాష్ట్రవైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
    ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ శాఖ అద్వర్యం లో నిర్వహించిన పరేడ్ ను పరిశీలించారు. స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు.

    అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కళా ప్రదర్శనలను తిలకించారు. సకటాల ప్రదర్శన తిలకించారు.
    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ,
    మిషన్ భగీరథ,
    మెప్మా , పశుసంవర్ధక శాఖ, మత్సశాఖ ల ప్రదర్శనశాల లను తిలకించారు.

    ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు.

    ఈ వేడుకల్లో టీ జి ఐ ఐ సి నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
    79 వ స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు రాష్ట్రవైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ శాఖ అద్వర్యం లో నిర్వహించిన పరేడ్ ను పరిశీలించారు. స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కళా ప్రదర్శనలను తిలకించారు. సకటాల ప్రదర్శన తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ, మిషన్ భగీరథ, మెప్మా , పశుసంవర్ధక శాఖ, మత్సశాఖ ల ప్రదర్శనశాల లను తిలకించారు. ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు. ఈ వేడుకల్లో టీ జి ఐ ఐ సి నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 345 Views 0 Reviews
  • అహ్మద్ గుడా 2 BHK కీసర మండల్ : ఈ కాలనీలో 41 బ్లాకులు ఒక్కొక్క బ్లాక్లో 108 ప్లాట్లు మొత్తం ఇక్కడ 4428 ప్లాట్లు రెండు పేజీలు ఉన్నాయి ఫేస్ 1 ఫేస్ 2 అయితే మీ ఇంట్లో మీరు వచ్చి ఉండాలి అని అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాలంటే సరైన సౌకర్యం లేదు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి బస్ సరైన సౌకర్యం లేదు చాలా సమస్యలను డబుల్ బెడ్ రూమ్ నివాసితులు వ్యక్తం చేశారు ఫేస్ 1 జనరల్ సెక్రెటరీ షేక్ భాయ్ మరియు నివాసితుల మాటల్లో విందాం.
    అహ్మద్ గుడా 2 BHK కీసర మండల్ : ఈ కాలనీలో 41 బ్లాకులు ఒక్కొక్క బ్లాక్లో 108 ప్లాట్లు మొత్తం ఇక్కడ 4428 ప్లాట్లు రెండు పేజీలు ఉన్నాయి ఫేస్ 1 ఫేస్ 2 అయితే మీ ఇంట్లో మీరు వచ్చి ఉండాలి అని అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాలంటే సరైన సౌకర్యం లేదు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి బస్ సరైన సౌకర్యం లేదు చాలా సమస్యలను డబుల్ బెడ్ రూమ్ నివాసితులు వ్యక్తం చేశారు ఫేస్ 1 జనరల్ సెక్రెటరీ షేక్ భాయ్ మరియు నివాసితుల మాటల్లో విందాం.
    Love
    1
    0 Comments 1 Shares 595 Views 13 0 Reviews
  • సమస్యలతో సతమతమవుతున్న టు బిహెచ్కె లబ్ధిదారులు అహ్మద్గూడా
    సమస్యలతో సతమతమవుతున్న టు బిహెచ్కె లబ్ధిదారులు అహ్మద్గూడా
    0 Comments 0 Shares 273 Views 4 0 Reviews
  • కీసర మండలం అహ్మద్గూడా 2BHK లబ్ధిదారుల సమస్యలు:
    కీసర మండలం అహ్మద్గూడా 2BHK లబ్ధిదారుల సమస్యలు:
    0 Comments 0 Shares 271 Views 7 0 Reviews
  • తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం :

    రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా .

    అసోసియేట్ ప్రొఫెసర్స్ నుండి ప్రొఫెసర్స్ గా పదోన్నతులు కల్పించినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా గారికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ల సంఘం ప్రతినిధులు .

    తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 1690 డాక్టర్ పోస్టుల భర్తీ కీ సానుకూలంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పందించారు .

    డాక్టర్ల పోస్టుల భర్తీకీ తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి దామోదర్ ఆదేశం.

    డాక్టర్ల ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపు పై నిబంధనలు రూపొందించటానికి కమిటీ నీ నియమిస్తాం. మంత్రి దామోదర్ రాజనర్సింహా .

    TVVP లో క్యాడర్ స్ట్రెంత్ పెంపు పై కమిషనర్ డా . అజయ్ కుమార్ తో చర్చించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా .

    TGGDA డాక్టర్ల సంఘం ప్రతినిధులతో సంగారెడ్డి లోని తన నివాసం లో మంత్రి దామోదర్ రాజనర్సింహా సమావేశం .

    డాక్టర్ల సమస్యల పై అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి పై మంత్రి దామోదర్ రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు .

    ఈ సమావేశం లో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (TGGDA) అధ్యక్షులు డా . నరహరి , సెక్రెటరి జనరల్ డా . లాలు ప్రసాద్ , డా . రాహుఫ్ , డా . వినయ్ కుమార్ , డా . గోపాల్ , డా . క్రాంతి , డా . అశోక్ , డా . రామ్ సింగ్ లు పాల్గొన్నారు .
    తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా . అసోసియేట్ ప్రొఫెసర్స్ నుండి ప్రొఫెసర్స్ గా పదోన్నతులు కల్పించినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా గారికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ల సంఘం ప్రతినిధులు . తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 1690 డాక్టర్ పోస్టుల భర్తీ కీ సానుకూలంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పందించారు . డాక్టర్ల పోస్టుల భర్తీకీ తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి దామోదర్ ఆదేశం. డాక్టర్ల ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపు పై నిబంధనలు రూపొందించటానికి కమిటీ నీ నియమిస్తాం. మంత్రి దామోదర్ రాజనర్సింహా . TVVP లో క్యాడర్ స్ట్రెంత్ పెంపు పై కమిషనర్ డా . అజయ్ కుమార్ తో చర్చించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా . TGGDA డాక్టర్ల సంఘం ప్రతినిధులతో సంగారెడ్డి లోని తన నివాసం లో మంత్రి దామోదర్ రాజనర్సింహా సమావేశం . డాక్టర్ల సమస్యల పై అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి పై మంత్రి దామోదర్ రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు . ఈ సమావేశం లో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (TGGDA) అధ్యక్షులు డా . నరహరి , సెక్రెటరి జనరల్ డా . లాలు ప్రసాద్ , డా . రాహుఫ్ , డా . వినయ్ కుమార్ , డా . గోపాల్ , డా . క్రాంతి , డా . అశోక్ , డా . రామ్ సింగ్ లు పాల్గొన్నారు .
    0 Comments 0 Shares 535 Views 0 Reviews
  • *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు*

    కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్)

    కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు.
    పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.
    #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు* కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్) కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు. పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు. #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • *పేకాట స్థావరంపై దాడి ఏడుగురి అరెస్టు*

    *•సిఐ వెంకట్ రెడ్డి*

    కంగ్టి ,1 ఆగష్టు,(భారత్ ఆవాజ్ న్యూస్)

    గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో గంగూశెట్టి కిరాణా షాపు ముందు పేకాట ఆడుతున్నారు అని నమ్మదగిన సమచారం రావడంతో వెంటనే కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి,కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి, మరియు సిబ్బంది కలిసి రైడ్ చేయగా 7 మంది పేకాట ఆడుతుండగా వారిని పట్టుకోవడం జరిగింది.వారి వద్ద మొత్తం 9260/- రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వారిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతోంది అని సిఐ వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు.
    కంగ్టి మండలంలో ఎవరైన పేకాట ఆడితే -8712656734,8712656760 నంబర్లకు సమాచారం ఇవ్వండి.వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. పేకాట ఆడడం వల్ల సంసారాలు నాశనం అవుతాయి,అప్పుల పాలు అవుతారు, అది ఒక వ్యసనంగా మారి తాగుడుకు బానిస అవుతారు,కావున ఎవరన్నా పేకాట అడుతే తాట తీస్తాం,ఎవరైన సరే ఉరుకునే ప్రసక్తే లేదు అని కంగ్టి సిఐ తెలియజేశారు.
    #telangana #news #kangti #narayankhed #bharataawaz #newsrtelangana
    *పేకాట స్థావరంపై దాడి ఏడుగురి అరెస్టు* *•సిఐ వెంకట్ రెడ్డి* కంగ్టి ,1 ఆగష్టు,(భారత్ ఆవాజ్ న్యూస్) గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో గంగూశెట్టి కిరాణా షాపు ముందు పేకాట ఆడుతున్నారు అని నమ్మదగిన సమచారం రావడంతో వెంటనే కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి,కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి, మరియు సిబ్బంది కలిసి రైడ్ చేయగా 7 మంది పేకాట ఆడుతుండగా వారిని పట్టుకోవడం జరిగింది.వారి వద్ద మొత్తం 9260/- రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వారిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతోంది అని సిఐ వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు. కంగ్టి మండలంలో ఎవరైన పేకాట ఆడితే -8712656734,8712656760 నంబర్లకు సమాచారం ఇవ్వండి.వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. పేకాట ఆడడం వల్ల సంసారాలు నాశనం అవుతాయి,అప్పుల పాలు అవుతారు, అది ఒక వ్యసనంగా మారి తాగుడుకు బానిస అవుతారు,కావున ఎవరన్నా పేకాట అడుతే తాట తీస్తాం,ఎవరైన సరే ఉరుకునే ప్రసక్తే లేదు అని కంగ్టి సిఐ తెలియజేశారు. #telangana #news #kangti #narayankhed #bharataawaz #newsrtelangana
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • 🗳 గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు విద్య, వ్యాపారాలు, నాయకత్వం వంటి అవకాశాలు సమానంగా లభిస్తున్నాయా?
    🗳 గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు విద్య, వ్యాపారాలు, నాయకత్వం వంటి అవకాశాలు సమానంగా లభిస్తున్నాయా?
    0
    0
    0
    0
    0 Comments 0 Shares 390 Views 0 Reviews
  • You must be 18+ to view this content
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com