• 'బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో నష్టం'
    బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో ఆరోగ్యానికి నష్టమని ఐసీడీఎస్ సీడీపీవో జాగాన విజయలక్ష్మి అన్నారు. బొబ్బిలి మండలంలోని పక్కి, కృష్ణాపురం, మెట్టవలస గ్రామాలు, కేజీబీవీ పాఠశాలలో బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణ వల్ల కలిగే నష్టాలపై అమ్మాయిలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేస్తే టీనేజ్లో గర్భం దాల్చి అనారోగ్యం బారిన పడతారన్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 385 Views 0 Reviews
  • ఉపాధి వేతనదారులకు రూ.307 అందేలా చూడాలి: డ్వామా పీడీ
    ఉపాధి వేతనదారులకు కనీస వేతనం రూ.307 అందేలా చూడాలని డ్వామా పీడీ కె.శారదాదేవి అన్నారు. బొబ్బిలి మండలం గొర్లె సీతారాంపురం చెరువులో జరుగుతున్న పనులను గురువారం పరిశీలించారు. పనులకు సమయపాలన పాటించాలని వేతనదారులను కోరారు. ప్రతి కుటుంబానికి ఉపాధి పనులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. #Boiena Rajesh 
    0 Comments 0 Shares 387 Views 0 Reviews
  • నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
    బొబ్బిలి మండలం పెంట సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే రంగరాయపురం ఫీడర్ నిర్వహణ పనులు కోసం గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE బి.రఘు చెప్పారు. రంగరాయపురం, జె.రంగరాయపురం, చెల్లారపువలస, ఎం.బూర్జవలస గ్రామాలకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ అంతరాయనికి సహకరించాలని ప్రజలను కోరారు. #Boiena Rajesh 
    0 Comments 0 Shares 391 Views 0 Reviews
  • బొబ్బిలిలో మినుములు, పెసలు కొనుగోల కేంద్రం ప్రారంభం
    బొబ్బిలి పట్టణంలో ఉన్న పిఏసిఎస్ కేంద్రంలో శుక్రవారం మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాన్ని పిఏసిఎస్ అధ్యక్షుడు బి. శ్రీరామ్మూర్తి ప్రారంభించారు.రైతులు దళారీల బారిన పడకుండా చూసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, నియోజకవర్గం రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్వింటా మినుములు రూ.7,800, పెసలు రూ. 8,768కు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో నాయకులు, అధికారులున్నారు....
    0 Comments 0 Shares 386 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com