Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • బొబ్బిలి రెవెన్యూ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
    బొబ్బిలి రెవెన్యూ కార్యాలయంలో తుఫాన్ సహాయక చర్యలు కోసం కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జ్ ఎమ్మార్వో సుబ్బారావు చెప్పారు. ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురిసే వర్షాలకు నష్టం నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెవెన్యూ అధికారులు ప్రజలు, రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. #RAJESH
    239 Views
  • Focus should be on alternative crops
    In Mettavalasa of Bobbili mandal, Agriculture Department JD Haribabu Chowdhury visited the fields and held a meeting with the farmers. He urged farmers to focus on alternative wet crops as rainfall will decrease due to the effect of El Nino. He created awareness on the need for crop protection and crop insurance. Agriculture officials participated in the program. #RAJESH
    Like
    1
    258 Views
  • Har Ghar Tiranga Rally in Penta village
    Har Ghar Tiranga was organized in Penta, Bobbili mandal on Wednesday. MPDO Ravikumar, MEO-2 Vasu, HM Venugopal, teachers, and secretariat employees explained the history of the great men who sacrificed their lives in the freedom struggle while holding the national flags to the students. They urged everyone to respect the national flag and celebrate Independence Day in a grand manner....
    211 Views
  • బొబ్బిలి (M) పారాది గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమంలో AP PCC అధ్యక్షురాలు YS. షర్మిల పాల్గొన్నారు. మల్లంపేట రెవెన్యూ పరిధిలో 7 ఎకరాల భూమి బొబ్బిలి MLA, ఆయన అనుచరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు బాధితులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే MLA బేబినాయనకి ఫోన్ చేసి సమస్యపై ప్రజలకు సమాధానం చెప్పాలని కోరగా.. వచ్చి తమకు చెబుతానని సమాధానమిచ్చారు.
    #Bobbili #yssharmila #Babynayana
    8 Views 1.5K Views
  • ఇసుక అక్రమ రవాణాపై కొరడా
    బొబ్బిలి మండలంలోని ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కొరడా ఝాలిపించారు. బొబ్బిలి మండలంలోని వేగవతినది నుంచి ఇసుక అక్రమంగా తరలిచడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కొల్లి రాంకుమార్ దాడి చేసి 6 ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ తవ్వాకాలపై సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. #BOBBILI 
    403 Views
  • 'బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో నష్టం'
    బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో ఆరోగ్యానికి నష్టమని ఐసీడీఎస్ సీడీపీవో జాగాన విజయలక్ష్మి అన్నారు. బొబ్బిలి మండలంలోని పక్కి, కృష్ణాపురం, మెట్టవలస గ్రామాలు, కేజీబీవీ పాఠశాలలో బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణ వల్ల కలిగే నష్టాలపై అమ్మాయిలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేస్తే టీనేజ్లో గర్భం దాల్చి అనారోగ్యం బారిన పడతారన్నారు. #Boiena Rajesh
    532 Views
  • ఉపాధి వేతనదారులకు రూ.307 అందేలా చూడాలి: డ్వామా పీడీ
    ఉపాధి వేతనదారులకు కనీస వేతనం రూ.307 అందేలా చూడాలని డ్వామా పీడీ కె.శారదాదేవి అన్నారు. బొబ్బిలి మండలం గొర్లె సీతారాంపురం చెరువులో జరుగుతున్న పనులను గురువారం పరిశీలించారు. పనులకు సమయపాలన పాటించాలని వేతనదారులను కోరారు. ప్రతి కుటుంబానికి ఉపాధి పనులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. #Boiena Rajesh 
    536 Views
  • నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
    బొబ్బిలి మండలం పెంట సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే రంగరాయపురం ఫీడర్ నిర్వహణ పనులు కోసం గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE బి.రఘు చెప్పారు. రంగరాయపురం, జె.రంగరాయపురం, చెల్లారపువలస, ఎం.బూర్జవలస గ్రామాలకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ అంతరాయనికి సహకరించాలని ప్రజలను కోరారు. #Boiena Rajesh 
    533 Views
  • బొబ్బిలిలో మినుములు, పెసలు కొనుగోల కేంద్రం ప్రారంభం
    బొబ్బిలి పట్టణంలో ఉన్న పిఏసిఎస్ కేంద్రంలో శుక్రవారం మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాన్ని పిఏసిఎస్ అధ్యక్షుడు బి. శ్రీరామ్మూర్తి ప్రారంభించారు.రైతులు దళారీల బారిన పడకుండా చూసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, నియోజకవర్గం రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్వింటా మినుములు రూ.7,800, పెసలు రూ. 8,768కు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో నాయకులు, అధికారులున్నారు....
    534 Views