అల్వాల్, నవంబర్ 6: గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే వాటర్ ట్యాంకర్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. కేవలం అక్టోబర్ నెలలోనే నగర పరిధిలో సుమారు 2.2 లక్షల వాటర్ ట్యాంకర్లు బుక్ కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రోజుకు సగటున 6 వేల నుంచి 7 వేల ట్యాంకర్ల బుకింగ్‌లు నమోదవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో 87 వేల...