అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అఖిల భారత కిసాన్ సభ (AIKS) మోదీ సర్కారును హెచ్చరించింది. వాషింగ్టన్కు ఇచ్చే రాయితీలు దేశంలోని వ్యవసాయ రంగానికి ముప్పు తెస్తాయని, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ డీలు వెంటనే రద్దు చేసుకోవాలని హెచ్చరించింది. దాన్ని 'యాంటీ నేషనల్ డీల్'గా పేర్కొన్న AIKS ఆందోళనలకు సిద్ధం కావాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చింది.