బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ, గురువారం ఉదయం వరకు కొనసాగింది. తీరాన్ని దాటినప్పటికీ, భూభాగంపై ఇది ఇప్పటికీ తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 48 గంటల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు....