"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశాన్ని ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ డీసీ భోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై, మత పెద్దలు, స్థానిక నాయకులు, ప్రాంతీయ ప్రజలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ డీసీ భోగేశ్వర్లు మాట్లాడుతూ, పండుగలను సామరస్య...