31 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.32,52,064 చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మంగళవారం కావలి టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 1433 మంది దరఖాస్తు చేసుకోగా 1049 మందికి రూ.8,53,78,180 అందివ్వడం జరిగిందన్నారు. మరో 384 మంది లబ్దిదారుల దరఖాస్తులు ప్రాసెస్ లో ఉన్నవని, వెరిఫికేషన్ అనంతరం వారికి కూడా చెక్కులు అందజేయబడతాయని తెలిపారు....