Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సమయపాలన తప్పనిసరిగా పాటించాలి.. .. ఐసిడిఎస్ సూపర్వైజర్ షేక్. షాను.
    అంగన్వాడి కేంద్రాల నిర్వహణలో సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ షేక్. షాను తెలిపారు. ఆమె మంగళవారం గంగవరం, సోంపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్ర ప్రాంగణాలను శుభ్రపరచడం,పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, సురక్షితమైన తాగునీరు, పోషకాహార కౌన్సిలింగ్ తదితర వాటిపై పై అవగాహన...
    824 Views
  • సామర్లకోటలో ఎస్ఐ మౌనిక, ఎంపీడీవోకు సన్మానం
    సామర్లకోటలో ఎస్ఐ మౌనిక మరియు ఎంపీడీవో హిమామహేశ్వరి సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ సానా సతీశ్ బాబు ఆదేశాల మేరకు సోమవారం అచ్చంపేట కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులను పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ప్రజా సేవలో వారు చూపుతున్న అంకితభావం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని...
    1.8K Views
  • వేట్లపాలెం ప్రమాదంలో సేవలందించిన ఎస్ఐ, ఎంపీడీవోలకు సన్మానం
    వేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక, సామర్లకోట ఎంపీడీవో హిమా మహేశ్వరిలను ఘనంగా సన్మానించారు. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కాకినాడలోని కార్యాలయంలో సోమవారం మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు (బున్ని) పుష్పగుచ్చాలు అందించి శాలువాతో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో కూడా...
    2.4K Views
  • సారా విక్రయం కేసులో నిందితుడికి రిమాండ్
    సారా విక్రయం కేసులో నిందితుడైన సామర్లకోట పట్టణంలోని కుమ్మర వీధికి చెందిన గుబ్బల వీర ఆదివిష్ణువును సోమవారం కాకినాడ సబ్ జైలుకు తరలించారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారుల వివరాల ప్రకారం, నిందితుడిని సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి ఎదుట బైండోవర్ నిందితుడిగా హాజరు పరచారు. విచారణ అనంతరం తహసీల్దార్ మూడు రోజుల రిమాండ్ వారెంట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని కాకినాడ సబ్...
    2.1K Views
  • కట్టమూరులో అగ్నిప్రమాదం: మూగజీవాల సజీవ దహనం
    కాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతంలోని కట్టమూరు గ్రామంలో మంగళవారం (10-03-2026) ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. మంటలు సమీపంలోని షెడ్లు, గేదెల కొట్టాలకు వ్యాపించడంతో అక్కడ ఉన్న మూగజీవాలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో వాటిని కాపాడే అవకాశం లేకపోయిందని స్థానికులు...
    2.8K Views
  • పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టం
    పంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ హెచ్చరించారు. మంగళవారం పెద్దాపురం మండలం గోరింట, వడ్లమూరు గ్రామాల్లో ఆయన పర్యటించి రబీ పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటల సాగులో సమతుల్యంగా ఎరువులు వాడాలని, పరిమితికి మించి యూరియా వినియోగిస్తే పంటలకు మరియు నేల నాణ్యతకు నష్టం...
    2.3K Views
  • పెద్దాపురం ఆసుపత్రిలో మాతృత్వం కార్యక్రమం 100వ వారం పూర్తి
    పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న మాతృత్వం కార్యక్రమం 100వ వారాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా సీమంతాలు నిర్వహించి ఆశీర్వదించనున్నారు. తల్లి మరియు శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని...
    2.9K Views
  • పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదా
    చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేస్తూ మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఈ నిర్ణయంతో పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. జనవరి నెలలో పురపాలిక అధికారులు కౌన్సిల్ తీర్మానం ద్వారా స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం వాటిని పరిశీలించి...
    2.3K Views
  • వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
    వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈ ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారీ జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను...
    2.4K Views
  • Warm Welcome to @Gandla Vaijanath!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    363 Views